గన్నవరం: గన్నవరం విమారనాశ్రయం నుంచి ప్రతిరోజు దేశ వాణిజ్య రాజధాని ముంబాయికి ఈ నెల 4నుంచి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రతి రోజు విమానం ముంబాయి నుంచి వయా హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం చేరుకుని, తిరిగి 1.30 గంటలకు హైదరాబాద్ మీదుగా ముంబాయి వెళ్లనుందని విమానాశ్రయ డైరెక్టర్ బి.జి పాటిల్ తెలిపారు.




