హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది ఉత్తమ ఉపాధ్యాయులు గురువారం పురస్కారాలు స్వీకరించనున్నారు. విద్యాశాఖ నుంచి 95 మంది, ఇంటర్ విద్యా శాఖ (23), సాంకేతిక విద్యా శాఖ (3), విశ్వవిద్యాడయాలు. డిగ్రీ కళాశాలల నుంచి 78 మంది, సాంస్కృతిక శాఖ తరపున నలుగురు పురస్కారాలను అందుకోనున్నారనిప్రభుత్వం ప్రకటలో తెలిపింది. ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల పారితోషికంతో పాటు పతకం, ప్రశంసాపత్రాన్ని అందచేసి , శాలువతో సత్కరించనున్నారు. గురుపూజోత్సవ వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలొ గురువారం ఉదయం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి హాజరవుతారని ఆహ్వన పత్రికల్లో ముద్రించారు. సభాధ్యాక్షులుగా ఉపముఖ్యమంత్రి, ఉన్నతవిద్యా శాఖమంత్రి రాజనర్సింహ వ్యవహరించాల్సి ఉంది. అయితేఅయితే మ/క్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకావాడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కోన్నాయి. ఉపముఖ్యమంత్రి దామోదర పర్యటనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ఇద్దరూ ఒకే వేదిక పైకి రావడం ఇష్టం లేకనే ఈ వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోందని సంబందిత వర్గాలు విశ్లేషించాయి. మరోవైపు సీమాంధ్రలో గురువారం గురుపూజోత్సవ వేడుకలు జరిగే అవకాశాలు కనిపించడంలేదు.




