Tuesday, 3 November 2026

అన్ని అంశాలు పరిశీలించాకే సభకు అనుమతి: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: అన్ని అంశాలు పరిశీలించాకే ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. పోలీసు కమాషనర్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇతర సంఘాలు కూడా సభ నిర్వహణ కోసం అనుమతి కోరాయని, ముందు వచ్చిన వారికి అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఏపీఎన్జీవోల సభలో ఎలాంటి విధ్వంసం జరిగినా వారిదే బాధ్యతన్నారు. గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే సభలోకి అనుమతిస్తామని తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. సభ నిర్వహణ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, తాము పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. 19 షరతులతో ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఏపీ ఎన్జీవోలు  పోలీసు షరతులను తప్పకుండా పాటించాలన్నారు. పోలీసులు అనుమతి లేకుండా జంటనగరాల్లో ర్యాలీలు ధర్నాలు నిషిద్ధమని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *