హైదరాబాద్: విద్వేషాలు రెచ్చగొట్టము అని చెబుతున్న ఏపీ ఎన్జీవోలు పాశవిక చర్యలకు పాల్పడుతున్నారు. బషీర్‌బాగ్ వద్ద నడి రోడ్డు పై ఓయూ ఏఏసీ నేత దూదిమెట్ల బాలరాజు పై ఏపీ ఎన్జీవోలు పిడిగుద్దుల వర్షం కురిపించారు. తన మెదడు బాగోలేదని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించారు. బాలరాజు పై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కనీసం 10కు ఫోన్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. స్పృహ కోల్పోయిన బాలరాజును ఆస్పత్రికి తరలించకుండా బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు.




