Tuesday, 3 November 2026

రణరంగంగా నిజాంకళాశాల ప్రాంగణం

హైదరాబాద్‌, సెప్టెంబరు7 : నిజాం కళాశాల హాస్టల్‌ పరిసర ప్రాంతాలు రణరంగంగా తలపించారు. శనివారం ఏపీఎన్జీవోల సభకు హాజరయ్యేందుకు వెళుతున్న ఉద్యోగులను నిజాంకళాశాల విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు హాస్టల్‌లోకి చొరబడి అనుమానాస్పదంగా వున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ నిజాంకళాశాల విద్యార్థులు హాస్టల్‌ భవనంపైకి ఎక్కి ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి రాష్ట్రం ఏర్పడకుండా చేసేందుకు ముఖ్యమంత్రితో పాటు కొందరు పోలీసు అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు, ప్రభుత్వం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తుందని వారు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *