హైదరాబాద్: సీమాంధ్రుల సమైక్య పిచ్చి ముదిరింది. జైతెలంగాణ నినాదాలు చేసిన ఓ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ వద్ద సీమాంధ్ర ఉద్యోగుల అరాచకాలు చూడలేక తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్ జైతెలంగాణ నినాదాలు చేశాడు. దీంతో సహచర కానిస్టేబుళ్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. సీమాంధ్ర కానిస్టేబుళ్లా, తెలంగాణ ప్రాంతానికి చెందినవారా? అన్న విషయం తెలియడం లేదు.




