Wednesday, 4 November 2026

సభ జరుగుతుండగానే పిడుగుపాటు తెలంగాణ నోట్‌ రెడీ


ఒక అంకం ముగిసింది
సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌
హైదరాబాద్‌పై ప్రతిపాదనలెన్నొచ్చిన ఒకే నిర్ణయానికొచ్చాం
అన్ని పార్టీలు వైఖరి చెప్పాయి
అఖిలపక్షం నేనే నిర్వహించా
కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :
సీమాంధ్రులు సమైక్య రాష్ట్రం కోసం సభ నిర్వహిస్తుండగానే కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే పిడుగు పాటులాంటి నిజం చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే.. తెలంగాణపై  ¬ంశాఖ కేబినెట్‌ నోట్‌ తయారు చేస్తుందని సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. కేబినెట్‌ నోట్‌ తయారీ పక్రియ సకాలంలో పూర్తవుతుందన్నారు. అయితే 20 రోజులు కావచ్చే లేదా 40 రోజులు పట్టవచ్చన్నారు. తెలంగాణపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పిన తరవాతనే నిర్ణయం తీసుకున్నామన్నారు. కేబినెట్‌ నోట్‌ పక్రియ కాలానుగుణంగా కొనసాగుతోందన్నారు. ఢిల్లీలోని శాస్త్రీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ విషయంలో మూడు ప్రతిపాదనలున్నాయని.. అయినా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చామని తెలిపారు. అందరి అభిప్రాయాలను ఆంటోనీ కమిటీ తెలుసుకుంటుందని చెప్పారు. ఆంటోనీ కమిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునేందుకే ఆంటోనీ కమిటీ ఏర్పాటుచేశామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలూ తీసుకున్నాకే నిర్ణయానికి వచ్చామని, రాష్ట్రవిభజనపై తానూ అఖిలపక్షం నిర్వహించానని షిండే చెప్పారు. రాష్ట్ర విభజనపై రెండో పక్రియ కొనసాగుతుందని, రెండు పార్టీలు మినహా మిగతా అంతా తెలంగాణకు అనుకూలమని, కమ్యూనిస్టు పార్టీ మాత్రమే స్పష్టంగా వ్యతిరేకించిందని షిండే తెలిపారు. ఏపీఎన్జీవోల సభ పరిణామాలను పరిశీలిస్తున్నామన్నారు. అలాగే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పక్రియ ఆగే సమస్యే లేదని కూడా షిండే స్పష్టం చేశారు. తెలంగాణపై కేబినెట్‌ నోట్‌ తయారవుతుందని త్వరలోనే కేబినెట్‌ నోట్‌ పక్రియ ముగుస్తుందని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు కేంద్ర ¬ంశాఖ కేబినెట్‌ నోట్‌ తయారు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీమాంధ్రుల సభ గురించి తమకు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. మిగతా రాష్టాల్ర పరిస్థితి వేరు, తెలంగాణ వేరు అని షిండే చెప్పారు. ఇక తెలంగాణపై పునరాలోచించాల్సిన అవసరం లేదన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తాను కూడా ఒక సారి తెలంగాణపై అఖిలపక్షం నిర్వహించానని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *