Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ తెలంగాణలో అరతర్భాగం


– తలలేని మొండెం మాకక్కర్లేదు
– వెల్ఫేర్‌ పార్టీ యూటీ వ్యతిరేక సభలో కోదండరామ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమేనని, హైదరా బాద్‌లేని తెలంగాణ తలలేని మొండెంలాంటిదని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సేవ్‌ ఆంద్ర óప్రదేశ్‌ పేరిట తె లంగాణ వాదులపై దాడులు చేయడాన్ని ఆయ న తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌ను కేంద్రపా లిత ప్రాంతంగా చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రాంతంలో విలీనానికి ముందు హైదరాబా ద్‌ అంతర్భాంగా ఉన్న 10 జిల్లాల తెలంగాణనే కోరుకుంటు న్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ ఆర్థికంగా రైలింజన్‌లాం టిదని అభిప్రాయపడ్డారు. గుప్పెడు మంది పెట్టుబడి దారు లు అనవసరంగా సీమాంధ్ర ప్రజల్లో భ యాందోళనలు సృష్టి స్తున్నారన్నారు. బలవంతంగా కలిసుం డాలని కోరుకోవడం నిరంకుశత్వమన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు, మూడు రోజుల్లో భవిష్యత్‌ కార్యా చరణ రూపొందిం చి ముందుకు సాగుతామని, తెలంగాణ ఆకాంక్ష నెరవేరేవర కూ కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *