Tuesday, 3 November 2026

అందుకే మిమ్మల్ని మద్రాస్‌లో రాజాజీ ఆంధ్రా డా… గెట్లాస్ట్‌ అన్నాడు


అలా అనిపించుకునే రోజు తెలంగాణలోనూ
జై తెలంగాణ అంటే దాడులు చేస్తారా : ఈటెల
నువ్‌ చదువుకున్న కాలేజీలో పోలీసులను పంపి కొట్టిస్తావా : జూపల్లి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) :
తెలంగాణవాదులు, విద్యార్థులు సీమాంధ్ర ఉద్యోగులు, పోలీసులు దాడి చేయడాన్ని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. గుండెలు మండి జైతెలంగాణ అంటే తమ బిడ్డలపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. జై తెలంగాణ అని నినాదాలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఈటెల విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వాదులపై దాడికి పాల్పడిన సీమాంధ్ర ఉద్యోగులపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణవాదులపై విరుచుకుపడ్డారన్నారు. నిజాం హాస్టల్‌లో చొరబడాల్సిన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. హాస్టల్‌లోకి వెళ్లేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ అంటే తప్పేమిటి? మా గడ్డపై మేము నినాదాలు చేయకూడదా? నిరసనలు తెలపకూడదా? తెలంగాణ నడిగడ్డపై జైతెలంగాణ నినాదాలు చేసే స్వేచ్ఛ కూడా మాకూ లేదా? అని ప్రశ్నించారు. జై తెలంగాణ అన్నందుకు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఓయూ విద్యార్థి నేత బాలరాజు యాదవ్‌ను సీమాంధ్ర గూండాలు, ఫ్యాక్షనిస్టులు తీవ్రంగా చితకబాదారని.. ఇంత హింస జరిగాక ఇంకా ఎందుకు కలిసి ఉండాలని నిలదీశారు. శనివారం నాటి ఘటనలతో తెలంగాణ ప్రజల్లో ఒక ఆలోచన మొదలైందన్నారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిన సభ అని రుజువైందన్నారు. ఏపీ ఎన్జీవోల సభపై తెలంగాణ మంత్రులు, టీ-కాంగ్రెస్‌ నేతలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. సొంత గడ్డపై సీమాంధ్ర గూండాలు, పోలీసులు దాడులు చేస్తున్నా.. స్పందించరా? అని నిలదీశారు.డబ్బు ఉందన్న మదంతో సీమాంధ్రులు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తుందని ఈటెల మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కనుసన్నల్లోనే  సీమాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని విమర్శించారు. ఆయన ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవోల సభ జరిగిందన్నారు. తెలంగాణ గడ్డపై తెలంగాణవాదులపై దాడి చేసి నియంతృత్వ ధోరణి ప్రదర్శించారని మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకొనేందుకు యత్నిస్తున్న సీఎంతో పాటు సీమాంధ్ర నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదని, త్వరలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడనుందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు.

చదువుకున్న కాలేజీలోకి పోలీసులను ఎలా పంపగలిగావు : జూపల్లి

మై హైదరాబాదీ..హూ.. నేను తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణా వాదిననని చెప్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి నిజంగా మనిషిగా భావిస్తున్నాడా అని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు నిలదీశారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ నిజాం కళాశాలలో చదువుకున్నానని గొప్పలు చెప్పుకున్న కిరణ్‌ ఆకళాశాలలోకి పోలీసులను పంపించే ముందు ఆత్మ క్షోభించలేదా అని ప్రశ్నించారు. సిగ్గు శరం అనిపించలేదా అని ప్రశ్నించారు. అయినా సీమాంధ్రులకు నీతి జాతి నిజాయితిఅనేది ఉంటేకదా అని ఎద్దేవా చేశారు. హైకమాండ్‌ మాటను  తప్పకుండా అమలుచేస్తానని నిండు సభలో చెప్పడమేకాక, సిఎల్‌పి కోఆర్డినేశన్‌ సమావేశంలో కూడా నిర్ణయించినా తుంగలో తొక్కిన బడుద్దాయి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డేనని ఆరోపించారు. సీమాంధ్రులను రెచ్చగొడుతూ ఉద్యమానికి నిధులు వనరులు సమకూర్చడమేకాక, పోలీసులను ఎస్కార్ట్‌లుగా ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణవాదులు తలుచుకుని హైవేలను దిగ్బందించి ఉంటే ఏపిఎన్జీఓలసభ ఎలా జరిగేదని ప్రశ్నించారు. బస్సులను అడ్డు కుని ఉంటే ఎక్కడివారక్కడే ఆగిపోయేవారు కాదా అన్నారు. రాష్టాన్న్రి విభజించడాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యంగా ఉంచాలని ఒత్తిడి చేస్తూ సీమాంధ్ర పక్షపాతిగా మారిపోయాడని ఆరోపించారు. పశువులను బాధినట్లు బాదారని దీనిపై నోరు ఎందుకు మెదపడంలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సిఎంను సీటునుంచి తప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో విూటింగ్‌ పెట్టి తెలంగాణావాదులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించాలని చూశాడని ఆరోపించారు. ఎంత రెచ్చగొట్టాలని చూసినా ప్రజలు సంయమనంతో ఉండి తన్నులు తిన్నారని, ఇది చూసి రాత్రంతా కిరణ్‌ నిద్రపోయి ఉండడన్నారు. తానొకటి తలిస్తే  నొసలొకటి చేసింది అన్న రీతిలో భాద పడి ఉంటాడని ఎద్దేవా చేశారు. 1969లో జరిగిన హత్యలకు కిరణ్‌కుమార్‌రెడ్డి తెరలేపేందుకు కుట్రపన్నుతున్నాడని విమర్శించారు. సీమాంధ్రులు, కిరణ్‌బాబులు అరిచి గీపెట్టుకున్నా కూడా తెలంగాణ వాదులు రెచ్చిపోరన్నారు. కేంద్రం ఇంత దారుణం చూస్తుండికూడా ప్రేక్షక పాత్ర పోషించడం దుర్మార్గమన్నారు. తక్షణమే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని జూపల్లి డిమాండ్‌ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *