ఉమ్మడి రాజధాని కష్టమే


30లోపు భారీ బహిరంగ సభ
ప్రక్రియ వేగవంతం చేయండి
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌,
సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి)
సీమాంధ్రులు, ఏపీఎన్జీఓలు చేస్తున్న ఆగడాలను చూశాక హైదరాబాద్‌ను పదే ళ్లుకాదు గదా పదిరోజులుగా కూడా ఉమ్మడి రాజధానిగా ఉంచకూడదనే ఒత్తిడి తేవాలని తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. అనంతరం జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో పాటు, దేవిప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లు పెట్టాలని సమావేశం డిమాండ్‌ చేశారు. మరోసారి తమ డిమాండ్లను వెల్లడించేందుకు గాను సెప్టెంబర్‌ 30వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అయితే ఈ సమావేశం తేదీల్లో మార్పులు చేర్పులు ఉండొ చ్చన్నారు. ఈనెల 14వతేదీన తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అన్ని జిల్లాల చైర్మన్లు, కన్వీనర్ల సమావేశం ఉంటుందన్నా రు. ఇందులో సభ నిర్వహణ, కేంద్రాన్ని చేసే డిమాండ్లపై చర్చిస్తామన్నారు. ఆయా జిల్లాలకు చెందిన కమిటీలు కూడా ఈలోపు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించుకుని ప్రతిపాదనలను తీసుకు రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. తాము ఎంతవద్దన్నా కూడా సిఎం జోక్యం చేసుకుని హైదరాబాద్‌లో ఏపిఎన్జీఓల సమావేశం పెట్టించి ఇరు ప్రాంతాల మద్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కారణబూతమయ్యాడని ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం మరో సమావేశం కాని ఆందోళనలకు గాని అనుమతిస్తే మరింత దూరం పెరుగుతుందన్నారు. సీమాంధ్రలో 19 బిజెపి కార్యాలయాలు, నాలుగు సిపిఐ కార్యాలయాలను తెలంగా ణకు మద్దతిచ్చినందుకు దాడులు చేసి విద్వంసం సృష్టించారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఓ పార్టీగా వారి అభిప్రా యాన్ని వారు చెప్పుకునే అవకాశం ఉంటుందని, అయినంత మాత్రాన దాడులకు దిగుతామంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుందో సిఎం చెప్పాలని ప్రశ్నించారు. మీడియా కూడా తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మిందని, ఆనాడు జరిగిన చిన్నచిన్న పొరపాట్లను బూతద్దంలో చూపిస్తూ చర్చలు, గోష్టులు నిర్వహించాయని, మరి హైదరాబాద్‌లో లక్షలాది మంది లైవ్‌లో చూస్తుండగానే తెలంగాణవాదులపై సీమాంధ్రులు దాడులకు పాల్పడితే ఎందుకు ఆపని చేయలేదని ప్రశ్నించారు. మీడియాకు కూడా ప్రాంతీయ తత్వాలు ఉంటాయా అని కోదండరామ్‌ ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు దీనిపై ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనన్నారు. సీమాంధ్రులతో కలిసి ఉండడం వల్ల ప్రాణాలకు భయం ఉంటుందనే భావనను ఏపీఎన్జీఓల సభ సందర్భంగా నిరూపించారన్నారు. పైగా తమకు రక్షణ కావాలంటూ నెత్తీనోరు బాదుకుంటున్నారని విమర్శించారు. టీఎన్జీఓ అధ్యక్షుడు దేవిప్రసాద్‌ మాట్లాడుతూ సీమాంధ్ర సభకు వచ్చి వెల్తున్నప్పుడు బస్సులపై రాళ్లు రువ్వారని విష ప్రచారం చేస్తున్న ఏపీఎన్జీఓలు అందరి కళ్లముందే జరిగిన దాడులపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఉద్యోగుల సభలో ప్రకటించిన నాలుగు డిమాండ్లను తాము గతంలోనే వారి ముందుంచామని, ఇవి ఇరువర్గాలు కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం అవుతాయని చెప్పామని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపి ఏపిఎన్జీఓలకు వారికున్న అనుమానాలను నివృత్తి చేస్తే బాగుంటుందన్నారు. సకల జనుల సమ్మె సమయంలో 20సార్లు ప్రకటనలు చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి నేడు ఎందుకు ఆపని చేయడంలేదని నిలదీశారు. సీమాంద్ర ఉద్యోగుల చేత ప్రభుత్వమే సమ్మె చేయిస్తోందని తేటతెల్లం అయిందన్నారు. సిఐ, కానిస్టేబుల్‌పైన బహిరంగంగా భౌతిక దాడులకు పాల్పడిన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజల ఆకాంక్ష అయిన జై తెలంగాణ నినాదాన్ని వెలిబుచ్చితే దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. పదమూడేళ్ల ఉద్యమంలో ఎంతో మంది తమఆందోలనల సమయంలో జైసమైక్యాంధ్ర అన్న అధికారులు, ఉద్యోగులున్నారని, వారిపై తామెప్పుడు కూడా బౌతికంగా దాడులకు పాల్పడలేదన్నారు. తెలంగాణ వారికి సీమాంధ్రులకు ఉన్న తేడా ఇదేతార్కాణ మన్నారు. జైతెలంగాణ అంటూ ఒక్కరు వస్తేనే సహించలేని సీమాంధ్రులు, ఏపిఎన్జీఓలు నాలుగున్నర కోట్ల మంది వస్తే ఎక్కడ తట్టుకుంటారని నిలదీశారు. సమ్మె కొనసాగిస్తూ కలిసి ఉందామనడం దుర్మార్గమే అవుతుందన్నారు. రాష్ట్ర విభజనతోనే శాశ్వతంగా విడిపోదామనే పరిస్థితులు తెచ్చుకోవద్దని దేవీప్రసాద్‌ ఏపీఎన్జీఓలకు సూచించారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ విభజన సమయంలో అక్రమంగా పదోన్నతులు, బదిలీలు కొనసాగుతున్నాయని వీటన్నింటిపై తప్పకుండా రివ్యూ చేయడం జరుగుతుందన్నారు. అధికారులు ఏ ప్రాంతంలోకి వెల్లినా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న రెవెన్యూ భూములను పంపిణీ చేస్తూ లోలోన కుట్రలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈకేటాయింపులను వేగంగా పూరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ తెలంగాణ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాడని, అలాగే సచివాలయంలో కూడా హెచ్‌ఓడిల్లో కూడా చాలామంది అధికారులు తెలంగాణ ఉద్యోగులను తుంగలో తొక్కుతూ సీమాంధ్రులకు పదోన్నతలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఐఎఎస్‌లు కూడా ఉండడం బాదాకరమన్నారు. తెలంగాణ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులంతా సంయమనంతోనే ఉన్నారని, ఇక ముందుకూడా ఇలాగే ఉంటామని, సీమాంధ్రులు, ఏపీఎన్జీఓలు రెచ్చగొడితే మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు వెనుకంజ వేయబోమని శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. తప్పుచేస్తున్న అధికారులు, ఉద్యోగులపై కచ్చితంగా రాష్ట్రవిభజన తర్వాత చర్యలు తప్పవన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత జరిగిన ప్రతివ్యవహారంపై తాము పునఃసమీక్షించుకుంటామన్నారు. ఇక కలిసి ఉండే ఆస్కారమే లేదన్నారు. ఏపీఎన్జీఓలు రాష్ట్ర విభజనకు సహకరించి ఇరు ప్రాంతాల మద్య విద్వేషాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉద్యోగుల సంఘం నేత విఠల్‌ మాట్లాడుతూ ఏపీఎన్జీఓలు ఇది ప్రారంభం మాత్రమే అంటున్నారని, ఇదే చివరిది కూడాకావాలని సూచించారు. అలాకాకపోతే రెండు ప్రాంతాల ప్రజల్లో మరింత వైషమ్యాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. తమ ప్రాంతానికే వచ్చి తమవారిపై దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తాము సహకరించడం వల్లే ఏపిఎన్జీఓల సభ జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాము గనుక శాంతిర్యాలీ నిర్వహించి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. ఇప్పటికైనా ఏపీఎన్జీఓలు తమ పిచ్చివాదనను మానుకుని రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు.