
మంత్రి డీకే అరుణ ఫైర్
ఇరు ప్రాంత నేతలతో చర్చించాలి
భారీ బహిరంగ సభకు టీ కాంగ్రెస్ యోచన
హైదరాబాద్,
సెప్టెంబర్ 10 (జనంసాక్షి)
కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికే ముఖ్య మంత్రి అని మంత్రి డీకే అరుణ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీ మాంధ్ర ప్రాంతానికి మాత్రమే సీఎంగా వ్యవహరి స్తున్నారని ధ్వజ మెత్తారు. అందుకే తెలం గాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు దూరంగా ఉంటున్నారని చెప్పారు. అరుణ మంగ ళవారం మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఆపుతా మంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ ప్రాంత ప్రజలను మభ్యపె డుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన ఖాయమని, ఎవరెన్ని కుట్రలు చేసినా విభజన ఆగే సమస్యే లేదని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ ఒక ప్రాంత పక్షపాతిగా ఉంటు న్నందున తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారన్నారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నందున సమస్య పరి ష్కారానికి సీఎం కిరణ్ ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరపాలని సూచించారు. కూ ర్చొని చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుందని తెలి పారు. సీఎం కిరణ్ సీమాంధ్ర నేతగా కాకుండా ఇరు ప్రాంతాల వారితో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్నందున నిర్ణయం దిశగా ముందు కు వెళ్లేలా చర్యలు చేపట్టాను తాము సీఎంని కలిసి కోరనున్నట్లు చెప్పారు. అందరితో మాట్లాడేందుకు తాను సిద్ధమన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టు బడి ఉంటామని గతంలో అందరూ ప్రక టించారని.. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి విభజనకు సహకరించాలని సీమాంధ్ర నేతలకు సూచించారు. విభజనపై వెనక్కు తగ్గేది అధిష్టానం స్పష్టంగా చెబుతోం దన్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతలు ఆందోళనలు విరమించి, హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహించాలని కోరారు. తాము సీమాంధ్ర నేతలపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరబోమని, తెలంగాణ బిల్లును సత్వరమే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. ఒక ప్రాంతానికే ప్రతినిధిగా వ్యవహరిస్తుండడంపై మండిపడ్డారు. ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తామేనని ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ నేతలు.. త్వరలోనే భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. టీ-జేఏసీ బహిరంగ సభ కంటే ముందుగానే ఈ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు జగదీశ్వర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర విభజనను సీఎం సహా సీమాంధ్ర నేతలు అడ్డుకుంటుండడం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుండడంపై చర్చించారు. ఈ భేటీలో సీఎం కిరణ్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఆందోళనలకు అనుమతి ఇవ్వని సీఎం.. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం, పోలీసు బందోబస్తు పెట్టి సభ నిర్వహించడంపై భేటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జై తెలంగాణ అన్న తెలంగాణవాదులపై ఏపీ ఎన్జీవోలు, పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ తీర్మానం వస్తే ఓడించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సూచించడంతో సమావేశంలో తీవ్రంగా ఖండించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరించడమే కాకుండా ఇతరులను కూడా ధిక్కరించాలని ఒకరిద్దరు మంత్రులు సహా పలువురు ఎంపీలు మండిపడ్డారు. సీఎంను బహిష్కరించద్దామని ఎంపీలు గట్టిగా పట్టుబట్టారు. సీఎం వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణపై టీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ కంటే ముందుగానే భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మరోసారి సమావేశమై సభ స్థలం, తేదీపై చర్చించాలని అంగీకారానికి వచ్చారు.
జేసీ హల్‌చల్
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల సమావేశంలో మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్ చేశారు. టీ-కాంగ్రెస్ సమావేశం జరుగుతున్న సీఎల్పీ కార్యాలయంలోకి జేసీ దూసుకెళ్లారు. రాయల తెలంగాణకు అంగీకారం తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ ఏడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలుపుకోవాలని కోరారు. రాయల తెలంగాణకు మీరు అంగీకరిస్తే రాష్ట్ర విభజనకు తాము అంగీకారం తెలుపుతామని సూచించారు. అయితే, ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు తిరస్కరించారు. మా రాష్ట్రానికి గవర్నర్‌గా రావాల్సిన దివాకర్‌రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని ఆయనతో పేర్కొన్నారు. మా తెలంగాణ మాకు ఇస్తే చాలని ఆయనకు సర్దిచెప్పి పంపించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు జైతెలంగాణ నినాదాలు చేయగా, జేసీ జైఆంధ్రప్రదేశ్ నినాదాలు చేయడం గమనార్హం.
కిరణ్ సీమాంధ్రకే సీఎం




