
తెలంగాణ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 (జనంసాక్షి) :
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అమెరికా నుంచి ఢిల్లీకి చేరు కున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గత వారం అమెరికా వెళ్లిన సోని యా బుధవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వచ్చారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె 2011 ఆగస్టు 5న అమెరికాలో శస్త్రచికిత్స చేసుకున్నారు. అప్పటి నుంచి తరచూ అమెరికా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, గత నెలలో ఆహార బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ, ఓటింగ్ సందర్భంగా తీవ్ర అలసట, ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు సోనియా సెప్టెంబర్ 2న అమెరికా బయల్దేరి వెళ్లారు. ఆమె వెంట కూతురు ప్రియాంకగాంధీ కూడా ఉన్నారు. చికిత్స అనంతరం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీకి తిరిగివచ్చారు. కాగా, చికిత్స కోసం అమెరికా వెళ్లిన సోనియాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎస్‌ఎఫ్‌జే అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుతో అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. 1984లో సిక్కులపై జరిగిన దాడులలో కొందరు పార్టీ నాయకుల హస్తం ఉండగా సోని యా వారికి అండదండలు అందిస్తున్నారంటూ వారు తమ పిటిషన్‌లో ఆరోపించారు. న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. ఎస్‌ఎఫ్‌జేతో పాటు ఇతర సిక్కు మానవ సంఘాలు కూడా ఈ పిటిషన్ దాఖలుచేశారు. వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన సోనియాకు ఆస్పత్రిలోనే కోర్టు సమన్లు అందజేసి నట్లు ఎస్‌ఎఫ్‌జే వెల్లడించింది. న్యూయార్క్‌లోని స్లోన్-కెటెరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో చికిత్స తీసుకున్న సోనియాకు సమన్లు అందిం చినట్లు ఎస్‌ఎఫ్‌జే అటార్నీ గురుపత్వంత్ ఎస్,పన్నున్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇదివరకే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేబినెట్ సిద్ధం చేయగా, సోనియా రాకకోసమే ఇంతకాలం వేచి చూశారు. ఒకటి రెండు రోజుల్లో ఆ నోట్‌కు సోనియాతో ఆమోద ముద్ర వేయించి కేబినెట్ ముందుకు తెచ్చేందుకు హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాల నేతల నుంచి అభ్యంతరాల స్వీకరణకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ సూచనలేవి కేబినెట్ నోట్‌లో చేర్చనట్టు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ ఏర్పాటుపై మంత్రుల బృందాన్ని ఎలా గూ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ బృందం రాష్ట్రంలోని అన్ని పక్షాలు ఆ బృందానికే తమ వినతులు సమర్పిస్తాయి కాబట్టి ఆంటోని కమిటీ ప్రతిపాదనలు నోట్‌లో చేర్చనట్టు తెలిసింది. రెండు రోజుల్లో కేబినెట్ ముందు నోట్ పెట్టన తర్వాత న్యాయ శాఖ ఆమోదానికి పంపిస్తారని, వారం రోజుల్లో న్యాయ శాఖ ఆమోదం పొంది మళ్లీ కేబినెట్‌కు నోట్ వస్తుందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీకి చేరుకున్న సోనియా




