హైకోర్టు
హైదరాబాద్: నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని పక్కన పెట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరువారాల్లోగా ఈ నియామకాన్ని పున: సమీక్షించి, కొత్తగా నియామక ప్రక్రియను చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం కమిషనర్లు వి,వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మల నియామాకాలు రాజకీయ జోక్యంతోనే జరిగినట్టుగా అనిపిస్తున్నాయని ఇప్పటి వరకు వరు కూడా తమకు రాజకీయాలతో సంబంధం లేదంటూ స్పష్టంగా ,చెప్పలేక పోతున్నారని కోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ తీర్పు వెలువరించింది. వీరి నియామాకానికి సంభందించిన దస్త్రాన్ని గవర్నర్ తిప్పి పంపి నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ పిటిషనర్లు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. రాష్ట్రంలో సహ కమిషనర్ల నియామకాలు రాజకీయ జోక్యం తోనే జరిగాయంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య, రావు చెలికాని తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది.




