Tuesday, 3 November 2026

అన్ని రంగాల్లో సీమాంధ్రులే ఉంటే సమన్యాయమా?

హైదరాబాద్‌: ‘అన్ని రంగాల్లో పూర్తిగా సీమాంధ్రులుంటేనే సమన్యాయమన్నట్లా? అని టీజేఏసీ చైర్మున్‌ కొదండరాం ప్రశ్నించారు. నగరంలో బీజేఆర్‌ ప్రభుత్వ కాలేజీలో తెలంగాణ పనర్‌ నిర్మాణం పై టీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన సెమినర్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క సినిమాలు, మీడియానే కాదు వ్యవస్థలన్నీ కూడా సీమాంధ్రుల చేతిలో ఉన్నయని కోదండరాం అన్నారు. చివరకు పాఠ్య పుస్తకాన్ని ఎవరు రాయాలో నిర్ణయించేది కూడా సీమాంధ్రులేనని ఆయన పేర్కోన్నారు. అన్ని రంగాల్లో సీమాంధ్రులే ఉంటే మన సమస్యలు ఎలా అర్ధమవుతాయని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *