మతం, విద్వేష వాహకం కారాదు

-రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ
\న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) :
ఇటీవల ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న మతఘర్షణలపై రాష్ట్రపతి ప్రణ బ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం విద్యాసాగర్‌ వర్సిటీలో ఏడో విద్యాసాగర్‌ స్మారకోపన్యాసం చేశారు. మతం, విద్వేషం వ్యాపకం కారా దని పేర్కొన్నారు. మత ఘర్షణల్లో మహిళలు, చిన్నారులు హత్యకు గురికావడం బాధాకరమన్నారు. కులం, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్న పండిట్‌ ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌ బోధనలు మనకు చెబుతున్నాయని ప్రణబ్‌ పేర్కొన్నారు. మహిళలపై దాడుల సమస్యపై ఆయన స్పందిస్తూ ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు హడావుడి చేయడం, తర్వాత మరచిపోవడం సరికాదన్నారు. మహిళల పట్ల గౌరవం సన్నగిల్లుతోందని.. ఇది అత్యంత ఆందోళనకరమని తెలిపారు. పోలీసు, న్యాయవ్యవస్థలో నిరంతరం సంస్కరణలు కొనసాగుతూనే ఉండాలని, ఈ పరిణామంతో బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు.