హైదరాబాద్‌ను దేశ ఐటీ రాజధాని చేద్దాం
ఎమ్మెల్యే కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తయారు చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలో అనేక ఐటీ హబ్బులు అభివృద్ధి చెందాయని, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పదింతల అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వల్లే చంద్రబాబు డెవలప్ అయ్యిండని తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు రెండు ఎకరాలున్న చంద్రబాబుకి ఇప్పుడు హైటెక్ సిటీ ఎదుట 15 ఎకరాల ఫాంహౌస్ ఉన్నదని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు దేశంలో అనేక ఐటీ హబ్బులు అభివృద్ధి చెందాయని, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పదింతల అభివృద్ధి సాధిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాయపాటి, దగ్గుబాటి, లగడపాటి, మేకపాటిలు సమైక్యవాదులు కారని, పచ్చి అవకాశవాదులని కేటీఆర్ ఆరోపించారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐటీ అసోసియేషన్ అవగాహన సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. చంద్రబాబు సిగ్గుమాలిన నేత అని విమర్శించారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు సమైక్యవాదులు కాదు అవకాశవాదులు అని చెప్పారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ జై తెలంగాణ అనడం తప్పయితే డ్యూటీలో ఉన్న సీఎం కిరణ్ జై సమైక్యాంధ్ర ఎట్ల అంటారు అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తప్పుబట్టినా డీజీపీ దినేశ్‌రెడ్డి పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మొద్దు అని సూచించారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తే సీమాంధ్ర నేతలతో చర్చలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బాగ్‌లింగంపల్లిలో జరిగిన తెలంగాణ ఐటీ అసోసియేషన్ సదస్సులో కేటీఆర్, చుక్కా రామయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఐటీ అసోసియేషన్ అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఐటీ రంగానికి రూ. లక్ష కోట్ల రూపాయాల బడ్జెట్ ఉంటదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఉద్యమంతో వచ్చిన తెలంగాణ ప్రకటనను నిలుపుకుంటామని చెప్పారు.



