ఊరూరా కాంగ్రెస్‌ జెండా ఇంటింటికీ తెలంగాణ ఎజెండా

17 నుంచి క్యాంప్‌గెయిన్‌
టీ మంత్రుల నిర్ణయం
హైదరాబాద్‌,
సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) :
మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆదివారం నిర్వహిం చిన టీ కాంగ్రెస్‌ నేతల సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 17న అన్ని జిల్లాల కాంగ్రెస్‌ కార్యాలయాలలో విమో చన దినం జరపాలని నిర్ణయించారు. 17 నుంచి వారం రోజుల పాటు ఊరూరా కాంగ్రెస్‌ జెండాలు ఎగురవేయాలని కోరారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్సే అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 22న ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలవాలని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర నేతల తీరు భరించలేకుండా ఉందని అభిప్రాయపడ్డారు. సీఎం పద్దతి మార్చుకోకుంటే కేబినెట్‌లో ఉండలేమని, తెలంగాణ మంత్రులు తెగేసి చెప్పాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెగేసి చెప్పారు. ఈ సమావేశంలో ఏడుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశానికి కేంద్రమంత్రి రేణుకాచౌదరి రావడం పట్ల ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజావార్తలు