తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులకుట్రలు

పది జిల్లాల
తెలంగాణ సాధించే వరకూ పోరు ఆపొద్దు : కోదండరామ్‌
వరంగల్‌బ్యూరో, జనంసాక్షి:
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్ర పన్నుతున్నారని, పది జిల్లాల తెలంగాణ వచ్చే వరకూ ఐక్యంగా పోరాడాలని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కొదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని దర్గాకాజీపేటలో తెలంగాణ సాకారం..పునర్నిర్మాణం సభ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. సీఎం కిరణ్‌, టీడీపీ అధినేత బాబు, వైఎస్‌ విజ యమ్మ ముగ్గురు తెలంగాణ దొంగలని, వారు అందరి ముందు కొట్లాడుకున్నట్లు కనిపిస్తూ.. లోలోపల సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపించడానికి మిలాఖత్‌ అయ్యారని ఆరోపిం చారు. తెలంగాణపై పెత్తనం కోసమే వారు ఒక్కటై కృత్రిమ ఉద్యమం కొనసాగిస్తున్నారన్నారు. హైదరాబాద్‌, నీళ్లు, భూ ములు తమవేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మీ బతుకు కోసం ఇక్కడ పెట్టుబడి పెంటిడ్రు.. లాభం మీరే పొందిడ్రు. అంతేకానీ మా కోసం మీరు కంపెనీలు పెట్ట లేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. పింఛన్‌ ఆగిపో తాయని చెబుతున్న సీఎం.. హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని వాడుకున్నట్లు చెప్పకనే చెప్పారన్నారు. వారిది పెత్తనం కోసం జరిగే ఉద్యమమైతే..మనది బతుకు పోరా టమని, న్యాయమైన ఉద్యమని పేర్కొన్నారు. యూపీఏ సర్కార్‌ తెలంగాణ ఏర్పాటుపై తాత్సరం చేస్తుండడం వల్లే ఉద్యమం సాగుతోందని, రాష్ట్రం ప్రకటిస్తే ఏ లొల్లి ఉండ దని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం అమలు కోసం తెలం గాణ కాంగ్రెస్‌ నాయకులు పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టడానికి, హైదరా బాద్‌పై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్‌తో..29న హైదరాబాద్‌లో జన భేరీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సభలో ఉద్యమంపై భవిష్యత్‌ కార్యచరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ గాంధీ భూపాతి కృష్ణమూర్తి, తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కన్వీనర్‌ జాగీర్‌, జలసాధన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.