‘మిస్ అమెరికా’గా నీనా దావులూరి!
న్యూజెర్సీ, సెప్టెంబర్ 16 : ‘మిస్ అమెరికా’ కిరీటాన్ని ప్రవాస తెలుగు యువతి నీనా దావులూరి కైవసం చేసుకున్నారు. మిస్ అమెరికా అందాల పోటీల్లో విజేతగా నిలిచి 24 ఏళ్ల నీనా దావులూరి రికార్డు సృష్టించారు. మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయ యువతిగా ఆమె నిలిచారు. మిస్ న్యూయార్కుగా ఎంపికైన రికార్డు ఆమె పేరిట ఉంది. అట్లాంటా నగరంలో పోటీలు జరిగాయి.. 15మందిని వెనక్కి నెట్టి మిస్ అమెరికా కిరీటాన్ని నీనా దావులూరి సొంతం చేసుకున్నారు. విజేతగా నిలిచిన నీనాకు 50వేల డాలర్లు ఉపకార వేతనంగా అందనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా నీనా దావులూరి తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలోని విజయవాడకు చెందినవారు.
——



