
ముజఫర్‌నగర్‌లో ప్రధాని, సోనియా, రాహుల్ పర్యటన
ముజఫర్‌నగర్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి) :
ఇరు వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి 48 మంది మృతికి కారణమైన అసలు దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. బాధితులను ఆదుకుం టామని ప్రధాని హామీ ఇచ్చారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. ఇటీవల అల్లర్లు జరిగిన ముజఫర్‌నగర్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో కలిసి ప్రధాని సోమవారం పర్యటించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఘర్షణల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడారు. అల్లర్లు జరగడం దురదృష్టకరమని అన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంతం వాతావరణం నెలకొనడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ఇళ్లు విడిచి వెళ్లిపోయిన వారిని తిరిగి సొంతింటికి చేర్చడమే తమ ప్రధాన ప్రాధాన్యమన్నారు. ప్రధాని, సోనియా పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ యువతి విష యమై ఇటీవల ముజఫ ర్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అల్లర్లు విస్తరించడంతో 48 మంది మరణించగా, వం దలాది మంది గాయపడ్డా రు. దాదాపు 45 వేల మంది ఇళ్లు విడిచి వెళ్లిపో యారు. వారంతా సహాయ క కేంద్రాల్లో తలదాచు కున్నారు. ఇదిలా ఉంటే, ముజఫర్‌నగర్ అల్లర్లపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దద్దరి ల్లింది. సోమవారం నుం చి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారం భమ య్యాయి. ముజఫర్‌నగర్ ఘర్షణలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ తొలిరోజే విపక్షాలు సభను స్తంభింపజేశాయి. బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్డీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ప్రధాని, సోనియా పర్యటనలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే వారు ముజఫర్‌నగర్‌లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, బీజేపీ కూడా కాంగ్రెస్ నేతల పర్యటనను తప్పుబట్టింది. ఓట్ల కోసమే వారు పర్యటిస్తున్నారని విమర్శించింది.
దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం బాధితుల్ని ఆదుకుంటాం : ప్రధాని




