
త్వరలో పవర్ ప్రాజెక్టు పెడతా : చంద్రబాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన వైట్ మనీ ప్రక టించారు. తన ఆస్తులు మరోసారి ప్రకటిస్తున్న సోమవారం పెద్ద హం గామానే సృష్టించారు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు జవాబు దారీగా ఉండాలనే తన ఆస్తులు వెల్లడిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపా రు. ఇప్పుడు ప్రకటించిన ఆస్తులు కాదని తనకు ఇంకా ఆస్తులు ఉన్నా యని నిరూపిస్తే ఇవి వారికే రాసిస్తానని సవాల్ విసిరారు. దేశవ్యా ప్తంగా ఉన్న నాయకులందరూ తనలాగే తమ ఆస్తులను ప్రకటించాలని కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆస్తుల వివరాలు ప్రకటించారు. చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన పేరుపై రూ.42.06 లక్షల విలువైన ఆస్తులు ఉండగా.. భార్య భువనేశ్వరి పేరిట రూ.33.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కుమారుడు లోకేశ్ పేరిట 49.2 కోట్లు, కోడలు బ్రాహ్మణి పేరిట రూ.33.06 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ప్రకటించారు. 1992లో స్థాపించిన హెరిటేజ్ కంపెనీని పూర్తి పాదర్శకతతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ ఆస్తుల్లో గతేడాదికి, ఇప్పటికి పెద్దగా తేడా లేదని చంద్రబాబు వెల్లడించారు. లోకేశ్ పేరుతో ఉన్న భూమిని అమ్మడం వల్ల కొంత ఆదాయం పెరిగిందని వివరించారు. తన ఆస్తులపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలని పేర్కొన్నారు. తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా ఎక్కడైనా తనకు, తన కుటుంబానికి ఆస్తులు ఉన్నాయని రుజువు చేస్తే వాటిని వారికే ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. సింగపూర్ సహా ఎక్కడా తనకు ఏవిధమైన ఆస్తులు లేవని స్పష్టం చేశారు. హెరిటేజ్ కంపెనీ ఈ ఏడాది ముప్పై మూడు శాతం డివిడెంట్ ప్రకటించిందని చెప్పారు. హెరిటేజ్‌లో మూడు వేల మంది ప్రత్యక్షంగా, 14 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. నాలుగు లక్షల మంది రైతులు, పదకొండు లక్షల మంది మంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నారని వివరించారు. గత రెండు దశాబ్దాలుగా సంస్థ సాధిస్తున్న పురోగతిని వివరించారు. కొత్తగా హెరిటేజ్ ఆధ్వర్యంలో పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కంపెనీ ఎన్నుడూ ప్రభుత్వం నుంచి చిన్న రాయితీ కూడా పొందలేదని తెలిపారు. సంస్థను మొదట తాను నడిపి, తాను మంత్రి అయ్యాక భువనేశ్వరికి అప్పగించానని చెప్పారు. గతేడాదితో పోలిస్తే హెరిటేజ్ 14.96 శాతం వృద్ధి సాధించిదన్నారు. హెరిటేజ్ సంస్థ అభివృద్ధిలో ఎవరి దయాదాక్షిణ్యాలు లేవని.. హెరిటేజ్ ఫుడ్స్‌ను వృత్తి నిబద్ధతతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న వారంతా తమ ఆస్తులు ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుడిగా సమాజానికి జవాబుదారి కాబట్టి స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించినట్లు తెలిపారు. తనకు డబ్బు విూద వ్యామోహం లేదని చెప్పారు. అవినీతి వల్ల రూపాయి విలువ పడిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. విలువలు క్షీణించడం, అవినీతి పెచ్చువిూరడం వల్లే దేశంలో ఆర్థిక సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. మైనింగ్, సెజ్‌ల పేరిట నేతలు సంపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. హవాలా మార్గంలో ధన ప్రవాహానికి అడ్డుకు వేస్తే అవినీతి నిర్మూలన సాధ్యవుతువుందని అభిప్రాయపడ్డారు. అయితే, టీడీపీ నాయకులు అందరూ ఆస్తులు ఎందుకు ప్రకటించడం లేదన్న విలేకరుల ప్రశ్నకు బాబు సూటిగా సమాధానమివ్వలేదు. ఆస్తులు ప్రకటించాలని వారిపై ఒత్తిడి పెంచబోనని చెప్పారు.
వైట్ మనీ ప్రకటించిన బాబు




