ఏపీఎన్‌జీవోల సమ్మెపై ఎందుకంత ఉదాసీనత

సర్కారు మెతక వైఖరిని తప్పుబట్టిన హైకోర్టు
చర్యలెందుకు తీసుకోవడం లేదుంటూ మొట్టికాయ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :
ఏపీఎన్జీవోల సమ్మె విషయంలో ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభు త్వంపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర సమ్మెపై వేసిన పిటిషన్‌ పైన వాదనలు జరిగాయి. ఈ సంద ర్భంగా ప్రభుత్వం సమ్మె విరమింప చేసేందుకు ఏం చర్య లు తీసుకున్నదని, ఇప్పటి వరకు ఎందుకు సమ్మె ను నిలుపుదల చేయలేకపో యారని ప్రశ్నించింది. ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో విచా రణ మళ్లీ రేపటికి వాయిదా పడింది. ఏపీఎ న్జీవోల సమ్మెపై హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాదనలు కొనసాగాయి. ఏపీఎన్జీవోలతో చర్చలకు ఏ న్యా యసూత్రం అనుమతిస్తుందని న్యాయస్థానం ప్రశ్నించింది. సమ్మె ఉపసంహ రించేలా కాక తీవ్రత తగ్గించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, సమ్మెను నివారించడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అలసత్వం వహిస్తున్నట్లుందని న్యాయస్థానం అభిప్రాయప డింది. ఏపీఎన్జీవోల సమ్మెపై దాఖ లైన ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారణార్హం కాద ని, పిటిషనర్‌కు సదుద్దేశం లేదని హైకోర్టులో ఏపీఎన్జీవో వాదనలు వినిపించింది. సమ్మె విష యమై తాము ప్రభుత్వానికి నోటీసు ఇచ్చామని హైకోర్టుకు చెప్పిన ఏపీఎన్జీవో ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. దానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ తాము ఏపీఎన్జీవోలతో ఎప్పటికి అప్పుడు చర్చలు జరుపుతున్నామని, మంత్రుల సంఘం వారితో చర్చిస్తోందని చెప్పారు. సమ్మె చేస్తున్నప్పటి నుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. సమ్మె నిలుపుదల కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే మంత్రులు జరిపే సంప్రదింపుల వల్ల ఫలితం ఉండదని, ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తమకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా కోర్టు నిరాకరించింది. సమ్మెను కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఏపీఎన్జీవోల సమ్మెపై తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవో సమైక్యాంధ్ర ఉద్యమంపై పిటిషన్‌ వేసిన పిటిషనర్‌ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆయన పిటిషన్‌ విచారణార్హం కాదని ఏపీఎన్జీవోల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఉద్యమంతో తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. సమ్మె విషయంలో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర విభజన ఇంకా అధికారికంగా జరగలేదని కేంద్రం తరఫు లాయర్‌ కోర్టుకు తెలిపారు.తమ సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్నామని

తాజావార్తలు