Wednesday, 4 November 2026

గణేశ్‌ నిమజ్జనానికి సిద్దమైన భద్రాచలం

ఖమ్మం: వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద పవిత్ర గోదావరి తీరం సిద్దమైంది. నిమజ్జనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఇడిశా నుంచి కూడా వినాయక విగ్రహాలను తీసుకోచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు క్రేన్లు, ఆరు లాంచీలు, 300మంది సిబ్బందితో పాటు 30మంది గజ ఈత గాళ్లను తీరంవద్ద ఉంచారు. ఎలాంటి అవాంచనీయ చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *