Wednesday, 4 November 2026

రేపు కేబినెట్‌ భేటీ


-తెలంగాణ నోట్‌పైనే అందరి దృష్టి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18
(జనంసాక్షి) :
కేంద్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు గురువారం అందుబాటులో ఉండకపోవడం వల్ల సమావేశాన్ని ఒక్కరోజు వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ భేటీలో తెలంగాణపై నోట్‌ను ప్రవేశపెడతారా? మళ్లీ వాయిదా వేస్తారా అనేదానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకుని విభజన ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళన ప్రారంభమైన నేపథ్యంలో మంత్రులతో పాటు అన్ని రాజకీ పార్టీలకు చెందిన నేతలు పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని విభజిం చవద్దని ఎపిఎన్జీవోలు, వివిధ ఉద్యోగ సంఘాలు గత 45 రోజులుగా ఆందోళనలు, సమ్మెలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన ఎడమొహం, పెడమొహంగా ఉన్న మంత్రులు సమావేశం కాగలరా అన్న చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 20న జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకోనుంది. ప్రతిసారి సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *