ఎట్టకేలకు మయన్మార్‌ మారణహోమంపై నోరు విప్పిన దలైలామా


హింసకు బౌద్ధం వ్యతిరేకం
మయన్మార్‌,జనంసాక్షి :
మయన్మార్‌లో రహింగ్యా తెగ ముస్లింలను ఊచకోత కోయడం బౌద్దానికి వ్యతిరేకమని దలైలామా పేర్కొన్నారు. ఊచకోత కోసి సంవ త్సరం గడిచిన తర్వాత దలైలామా నోరు విప్పడం గమనార్హం. ఓ మతాన్ని, ఓ జాతిని ఓ తెగను ఆ దేశం నుంచి సమూలంగా చెరపే యాలని చూడడం ఎంతమాత్రం సరికాదన్నారు. రహింగ్యా తెగ ముస్లింలను ఊచకోత కోస్తూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సైనికుల చర్య దుర్మార్గమని తెలిపారు. బర్మాలో నివసిస్తున్న రహింగ్యా తెగ ముస్లింల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తిం చడం బౌద్ద మతానికి విరుద్దమన్నా రు. మతమేదైనా కావచ్చు.. మనుషు లంతా ఒక్కటేనని గుర్తుంచ ుకోవాలని సూచించారు.  వేర్వేరు పాలన అందించే దుర్మార్గమైన దేశంగా ఈ దేశం ఖ్యాతికెక్కింది. అక్కడి బాధితులకు సహాయం చేయాలని మానవత్వంతో ముందువు వచ్చిన స్వచ్చంద సంస్థలు ఇచ్చే సహాయాన్ని కూడా వారికి అందకుండా చేసిన హేయమైన నియంతల దేశం.. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ లేదు. సైనికుల ఇష్టానుసారం తమ కోర్కెలు కలిగితే వివక్షను ఎదుర్కొన్న మహిళలను ఎత్తుకెళ్లి లెక్కలేనన్ని అత్యాచారాలు చేసినా అక్కడ ఇంతవరకు ఎవరూ నోరు విప్పలేదు. న్యాయ,ధర్మం పదాలకు అర్థం లేదు. దేశంలో లెక్కలేనన్ని కేసుల్లో 2000 పైగా రాజకీయ ఖైదీలుగా ఉన్నా జైలులో ఉన్నారు. 2010లో ఆగస్టులో బర్మా దేశం 7 రాష్ట్రలు, 7 ప్రాంతాలుగా విడిపోయింది. బర్మాలో బౌద్దులు మినహా ఎవరూ సైన్యంలో చేరడానికి, ప్రభుత్వోద్యోగాలు చేయడానికి అర్హత లేదు. అంతర్జాతీయ సహాయాన్ని అందకుండా మమన్మార్‌ ప్రభుత్వం అడ్డుకుంది. అమెరికా, అమ్నెస్టీ, ఇంటర్నేషనల్‌ సంస్థలు మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా మయన్మార్‌లో జరుగుతున్నాయని తప్పుబట్టాయి. ఈ విషయాన్ని గతంలో జనంసాక్షి వెలుగులోకి తెచ్చింది. మహిళల మానప్రాణాలను దోచుకుంటున్న మానవహక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రపంచ దేశాలు ఈ దారుణ మారణ కాండను ఆపేందుకు ప్రయత్నించి, వారికి మానవత్వపు పరిమళాలను అందించి వారికి జీవితంపై భయాందోళనలు తొలగించి భద్రతకు భరోసా ఇవ్వాల్సి ఉంది.

తాజావార్తలు