తెలంగాణ కేబినెట్‌ నోట్‌ సిద్ధం


పరిశీలించాక మంత్రి వర్గం ముందుకు
హైదరాబాద్‌పై నో అప్షన్స్‌
కేంద్ర హోం మంత్రి షిండే
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) :
తెలంగాణ నోట్‌ ఇప్పట్లో లేనట్లే.. రాష్ట్ర విభజన ప్రక్రియ వెనక్కు పోయినట్లే.. కేంద్రం వెనక్కి వెళ్తుంది.. అంటూ ఇప్పటిదాకా సీమాంధ్ర నేతలు చేసిన ఈ తరహా ప్రచారానికి ఇక తెర పడింది. రాష్ట్ర విభజన ఖాయమేనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుపై రూపొందించిన క్యాబినెట్‌ నోట్‌ శుక్రవారం జరగనున్న కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ముందుకు రానుంది. తెలంగాణ ఏర్పాటుపై కొంతకాలంగా కొనసాగుతున్న స్తబ్ధతకు కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే గురువారం తెర దించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ సిద్ధమైందని వెల్లడించారు. ఈ నోట్‌ను గురువారం సాయంత్రం పరిశీలిస్తామని చెప్పారు. గత పది రోజులుగా తనకు సమయం లేనందునే ఇంత సమయం పట్టిందని వివరించారు. శుక్రవారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో ఈ నోట్‌ను పరిశీలించనున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ యూపీఏ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ జూలై 30వ తేదీన ఏకాగ్రీవ తీర్మానం చేశాయి. హైదరాబాద్‌ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరుతూ సీడబ్ల్యూసీ కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే, కాంగ్రెస్‌ ప్రకటనతో సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగాయి. రాష్టాన్న్రి సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో  హైకమాండ్‌ పునరాలోచనలో పడిందని.. రాష్ట్ర విభజన ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌ పెట్టిందని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. అందుకు తగినట్లుగానే కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యంగ ప్రక్రియను ప్రారంభించకపోవడం వారికి ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరుగుతుందా? సుదీర్ఘ కల నెరవేరుతుందా? లేదా? అని తెలంగాణ వాదుల్లో అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు, ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే వరకూ తెలంగాణపై ముందుకు వెళ్లమని వీరప్ప మొయిలీ, విభజనపై తొందరపాటు నిర్ణయం జరిగిందని అహ్మద్‌పటేల్‌ వ్యాఖ్యానించినట్లు బుధవారం వార్తలు వెలువడ్డాయి. దీంతో డిసెంబర్‌ 9 నాటి ప్రకనపై వెనక్కుపోయినట్లే మళ్లీ వెనక్కు వెళ్లే అవకాశముందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ఏర్పాటుపై కొనసాగుతున్న స్తబ్ధతకు కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెర దించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి క్యాబినెట్‌ నోట్‌ సిద్ధమైందని ప్రకటించారు.