హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో పలు చోట్ల ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, నారాయణగూడతో, పాటు పటు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ద్విచక్రవాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు.



