హైదరాబాద్ తో ఆటలాడుకుంటే యుద్ధమే
హైదరాబాద్: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గాని, మారో రాష్ట్రంగా చేస్తే ఊరుకునేది లేదని ఎంఐఎం నేత అసరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తమ మాటను పెడచెవిన పెట్టిన కేంద్రం మొండిగా వ్యవహరిస్తే పరాణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కొందరు సీమాంధ్ర నేతలు, కొన్ని కంపెనీలు హైదరాబాద్ లో అక్రమంగా సంపాదించిన భూములను కాపాడుకోవడం కోసమే ఇటువంటి డిమాండ్‌లు పెడుతున్నారని ఎంఐఎం ఇటువంటి ప్రయత్నాలను సాగనివ్వదని ఓవైసీ అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకోవాలని కొంత కాలంగా సీమాంధ్రనేతలు కొందరు ఆయన పై ఒత్తిడి తేవడం హైదరాబాద్‌ను యూటీ చేస్తున్నారనే ప్రచారం ఊపందేకున్న నేపథ్యంలో ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



