తెలంగాణపై వెనకడుగు లేదు


కేంద్ర ఆమోదంతోనే నిర్ణయం
ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో
న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) :
తెలంగాణపై కేంద్రం పునరాలోచన ముచ్చటే లేదని కేంద్ర మంత్రి మనీష్‌తివారీ అన్నారు. తెలంగాణపై చేసిన నిర్ణయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. తెలంగాణ ఏర్పాటు పక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలో ఐదు రాష్టాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ అంశంపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన చెప్పారు. ఓ సారి నిర్ణయం జరిగాకర మళ్లీ వెనక్కి వెళ్లలేమన్నారు.’తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణ యంలో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో కూడా అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి వెళ్లే ఆలోచనలేదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర ప్రభు త్వం కూడా ఆమోదించిందని వివరించారు. ఇరు ప్రాంతాల్లో పరిస ి్థతిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం ఉం దని విలేకరులు ప్రస్తావించగా…ఉద్యమాల ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి వెళ్ళే ఆలోచనలేదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించారు. ఇరు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం ఉందని విలేకరులు ప్రస్తావించగా.. ఉద్యమాల ఒత్తిడిలో వాళ్లు రాజీనామాలకు ఉండొచ్చని వ్యాఖ్యానించారు.