తెలంగాణపై పునరాలోచన ముచ్చటే లేదు


ఐటీ హబ్‌గా హైదరాబాద్‌
10 శాతం డీఏ పెంపు
కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మనీష్‌
న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 20  (జనంసాక్షి) :
తెలంగాణపై కేంద్రం పునరాలోచన ముచ్చటే లేదని కేంద్ర మంత్రి మనీష్‌తివారీ అన్నారు.  తెలంగాణపై చేసిన నిర్ణయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. తెలంగాణ ఏర్పాటు పక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలో ఐదు రాష్టాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ అంశంపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన చెప్పారు. ఓ సారి నిర్ణయం జరిగాకర మళ్లీ వెనక్కి వెళ్లలేమన్నారు.’తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణ యంలో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో  కూడా అన్నారు. శుక్రవారం  ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి వెళ్లే ఆలోచనలేదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర ప్రభు త్వం కూడా ఆమోదించిందని వివరించారు. ఇరు ప్రాంతాల్లో పరిస ి్థతిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం ఉం దని విలేకరులు ప్రస్తావించగా…ఉద్యమాల ఒత్తిడితో వాళ్లు రాజీనామాలకు సిద్ధపడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.ఇదిలావుంటే తెలంగాణపై కేబినెట్‌ నోట్‌ సిద్ధమైందని  ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్వయంగా ప్రకటించిన తరవాత వీరు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.   ¬ం శాఖ నోట్‌ను షిండే తానింకా చదవలేదని చెప్పటంతో పాటు, కాంగ్రెస్‌ అధినేతి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌లతో దానికి రాజకీయ ఆమోదముద్ర వేయించుకోవటం మిగిలి ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘తెలంగాణపై ముసాయిదా తయారై తన  దగ్గరకొచ్చిందన్నారు.  షిండే పరిశీలన తర్వాత ముసాయిదాను న్యాయశాఖకు పంపిస్తారు. అంతేగాకుండా షిండే ఈ ముసాయిదాను సోనియా, మన్మోహన్‌లకు చూపించి ఆమోదం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం మెత్తబడటంలేదు. రాష్ట్ర విభ జన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేదిలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ కూడా కుండబద్ధలు కొట్టారు. ‘ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకూ కేబినెట్‌ నోట్‌ తయారు కాకూడదన్న విూ విజ్ఞప్తిని పరిశీలిస్తాం. అంతకుమించి వెనక్కుపోవడానికేవిూ లేదు. తెలంగాణాకు అనుకూలంగా అన్ని పార్టీలూ లేఖలిచ్చాయి. అందరూ చెప్పిన తర్వాతే చిట్టచివరిగా సీడబ్ల్యుసీ తీర్మానం జరిగింది. విూ ఆందోళనలు, సమస్యలు, అనుమానాలన్నింటినీ మంత్రివర్గ ఉపసంఘం చూసుకుంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఉద్యోగుల డీఏ 10 శాతం పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వద్యోగుల కిచ్చే కరువు భత్యాన్ని 10 శాతం పెంచుతూ మంత్రి వర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రస్తుం మున్న డీఏ శాతం 80 శాతం నుండి 90శాతానికి పెరిగింది. ఫలితంగా సుమారు 80 లక్షల మంది ప్రయోజనం పొందనుండగా వీరిలో దాదాపు 50 లక్షల మంది క్రేంద్ర ప్రభుత్వోద్యోగులు, 30 లక్షల మంది పింఛన్‌ దార్లు ఉన్నారు. ఈ పెంపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై 1వ తేదీ అమలు లోకి వస్తుందని సంబంధిత వార్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్ణయంతో ఖజానాపై ఈ ఏడాది రూ.10,879 కోట్లు, 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.6,297కోట్ల మేర భారం పడుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం 2010లో ఒకసారి 10శాతం మేర డిఏ పెంచగా, మూడేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతే శాతం డీఏ పెంచింది.