ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం

ఆదిలాబాద్‌: జిల్లాలోని బెజ్జూరు,సిర్పూరు, కాగజ్‌నగర్‌, కౌటాలలో భారీ వర్షం కురిసింది. దహెగాం వద్ద ఎర్రకాలువ పొంగిపొర్లుతుంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి మట్టం 699 అడుగులకు చేరింది.

తాజావార్తలు