గవర్నర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 : కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి రాష్ట్ర విభజనను ఆపాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు ఆందోళన పథంలో ఉంటే చంద్రబాబు, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమాషా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో విభజన ప్రక్రియను ఆపాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లా సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేయాలంటే ఎన్ని ఏళ్లు పడుతోందని ఆయన ప్రశ్నించారు. బాబుకు ఆత్మలేదు.. గౌరవంలేదన్నారు. రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం వల్లే విభజన జరగుతోందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర పాత్ర ఎంతో ఉందని మేకపాటి చెప్పారు.




