సూరత్‌లో వరద బీభత్సం

సూరత్‌ : సూరత్‌ పట్టణం వరదనీటితో మునిగితేలుతోంది. సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పట్టణాన్ని వరదనీటితో ముంచెత్తింది. అంతకు ముందు రెండు రోజుల నుంచి కూడా దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో నానిపోతాయన్న భయంతో ప్రజలు వాటిని తీసుకెళ్లి ఎత్తైన ప్లైఓవర్‌లపైన, బహుళ అంతస్థుల పార్కింగ్‌ భవనాల్లో పెట్టుకున్నారు. వరదలగురించి పెద్ద ఎత్తున పుకార్లు వ్యాపించడంతో …పుకార్లు నమ్మవద్దని ,అప్రమత్తంగా ఉండాలి కాని అనవసర ఆందోళన చెందవద్దని అధికారులు పలు రకాల మాధ్యమాల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

తాజావార్తలు