నేటి నుంచి ప్రధాని అమెరికా పర్యటన

ఢిల్లీ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి) :
భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం నుంచి అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చలు జరపనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో ఆయన పాల్గొంటారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్‌తోనూ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 27న వాషింగ్టన్‌లో మన్మోహన్‌సింగ్, ఒబామా సమావేశంలో పౌర అను ఒప్పందం అమలు, రక్షణ, భద్రత, ఆర్థిక అంశాలకు సంబంధించిన రంగాల్లో సహకారాన్ని విస్తృత పరిచే మార్గాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్), అమెరికా కంపెనీ వెస్టింగ్ హౌస్ మధ్య ఒప్పందంతో పాటు మరికొన్ని ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.



