మంత్రులకిచ్చిన డబ్బు లంచం కాదు


స్వచ్ఛంద కార్యక్రమాలకు!
మాజీ ఆర్మీ చీఫ్‌ వీకే సింగ్‌
గుర్గావ్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) :
ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ ఆత్మరక్షణలో పడ్డారు. తాను ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో సైన్యానికి కేటాయించిన నిధుల్లోంచి కొంత జ మ్మూకాశ్మీర్‌ మంత్రు లకు ‘సుస్థిరత’ కోసం ఇచ్చినట్లుగా చేసిన వ్యా ఖ్యలపై తీవ్ర దుమా రం చెలరేగడంతో మంగళ వారం ఆయన వివర ణ ఇచ్చుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌ మంత్రులకు సై న్యం ఇచ్చిన నిధులు లంచం కావని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. కొంత మంది మంత్రులకు నిధులు ఇచ్చామని చెప్పింది నిజమేనని తెలిపారు. అయితే ఆ నిధులు వారి వ్యక్తి గత అవసరాల కోసమో, రాజకీయ అవసరాల కోసమో మాత్రం ఇచ్చింది కాదని, స్వచ్ఛంద కార్యక్రమాల నిర్వహణ కోసమని తెలిపారు. కాశ్మీరీ ప్రజలను వేర్పాటువాద ఉద్యమాలకు దూరంగా ఉంచేందుకు, వారు అటువైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకునేందుకు మాత్రమే ఇచ్చామని చెప్పారు. అలాంటి కార్యక్రమాలు ఒక్క జమ్మూకాశ్మీర్‌లోనే కాదని, దేశంలోని పలు ప్రాంతాల్లో చేపట్టామని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇది కొనసాగుతోందని ఆయన తెలిపారు.

తాజావార్తలు