సైన్యం చరిత్రలోనే చీకటి అధ్యాయం

సీబీఐ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి : ఫరూఖ్ అబ్దుల్లా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం సైన్యం అవసరాల కోసం ఇచ్చే నిధులను మంత్రలకు అందించామని చెప్పడం సై న్యం చరిత్రలోనే చీకటి అధ్యాయమని నేషనల్ కాన్ఫ రన్స్ అధ్యక్షుడు, కేంద్ర మం త్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో మంగ ళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికే సైన్యం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యం కోసం కేటాయించిన నిధులను రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఖర్చు చేయాలగాని ప్రజాస్వామిక ప్రభు త్వాలను కూలదోసేందుకు వెచ్చించడంలో ఆతంర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. వీకే సింగ్ వ్యాఖ్యలు.. అంతకుముందు చోటు చేసుకున్న వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అసలు సైన్యానికి రాజకీయ నాయకులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కోరారు.



