హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం
సకల జనభేరికి భారీగా తరలిరండి : కోదండరామ్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) :
సీమాంధ్రులకు ఇంచు జాగా కూడా ఇవ్వమని, హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణలో అంతర్భాగమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కోదండరామ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విభజనపై సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలంటున్న ముఖ్యమంత్రి.. తెలంగాణలోని ప్రజల అభిప్రాయాలను పట్టించుకోడా? అని ప్రశ్నించారు. గురువారం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. చివరి బంతి వరకూ మ్యాచ్ ముగియదన్న సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చేయాల్సిన స్కోర్ చాలా ఉన్నప్పుడు చివరి బంతితో కిరణ్ ఏమీ చేయలేడని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి అనర్హుడని విమర్శించారు. ఒక ప్రాంత ప్రజలపై మమకారం చూపుతూ, మరో ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని, రాష్టాన్న్రి అడ్డుకోడం ఎవరి తరం కాదన్నారు. హైదరాబాద్ అందరిది అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్‌కు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందని అప్పట్లోనే దేశంలో ఐదో పెద్ద నగరమని చెప్పారు. సీమాంధ్రులు వచ్చే హైదరాబాద్‌ను అస్తవ్యస్తం చేశారన్నారు. సీమాంధ్రలో ఉద్ధృతంగా ఉద్యమం సాగుతుందన్న సీఎంకు తెలంగాణలో అంతకంటే పదింతల ఎక్కువగా ఉద్యమం కనబడలేదా? అని ప్రశ్నించారు. యవాత్ తెలంగాణ ప్రజలు, ఉద్యోగులంతా రోడ్డెక్కినప్పుడు పోలీసులను పెట్టి అడ్డుకున్న విషయం మర్చిపోయావా? అని నిలదీశారు.
జర్నలిస్టుల సత్యాగ్రహ దీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేశ్‌కుమార్‌పై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ, బషీర్‌బాగ్‌లో జర్నలిస్టులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, అల్లం నారాయణ, రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
– జనంసాక్షి, హైదరాబాద్




