Tuesday, 3 November 2026

అక్టోబర్‌ మొదటి వారంలో ‘టీ’ నోట్‌

సీడబ్ల్యూసీ నిర్ణయానికి తిరుగులేదు
వెనక్కుతగ్గం.. సీఎంను మార్చం
నోట్‌ వేరు.. ఆంటోనీ కమిటీ వేరు
సీఎం సీమాంధ్రకు కాదు : దిగ్విజయ్‌సింగ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) :
అక్టోబర్‌ మొదటి వారంలో కేంద్ర కేబినెట్‌ ముందుకు తెలంగాణ నోట్‌  రానుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. గురువారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ అని, ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెప్పారు. తీసుకున్న నిర్ణయంపై ప్రాంతీయ పార్టీలు మాట తప్పుతాయేమోగాని కాంగ్రెస్‌ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రి ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు, తెలంగాణ నోట్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.  విభజన అనంతరం తలెత్తబోయే సమస్య లను ఆ కమిటీ పరిశీలిస్తోందని, నదీ జలాల సమస్యను కూడా పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రుల సమస్యలను తెలంగాణ బిల్లులో చేర్చుతామని తెలిపారు.రాష్ట్ర విభజనపై సీఎం ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడంపై ఆయనను ప్రశ్నించగా ఆ ఇంటర్వ్కూ తను చూడలేదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకు సీఎం కాదని, రెండు ప్రాంతాలకు ఒకే విధంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం ఆయననే సీఎంగా కొనసాగిస్తామని, మార్చే ఉద్దేశం లేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *