
రాష్ట్రపతి పాలన పెట్టి తెలంగాణ ఇవ్వండి
చంబార్‌దేవుకు చప్పల్‌కా పూజ
కిరణ్‌పై కేసీఆర్ ఆర్పార్
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (జనంసాక్షి) :
సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న బేకార్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టైనా తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సీమాంధ్రులు దేనికైనా తెగిస్తారనడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినట్లు ముఖ్యమంత్రే తప్పుడు లెక్కలు చెప్పారని అన్నారు. అక్రమంగా నీళ్లు తీసుకెళ్లి పోతున్నా తాము మౌనంగా చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం తర్వాత సీఎం ఆగమేఘాల విూద ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సిఎం సంతకాలు పెట్టిన జీవోలన్నింటిపైనా సవిూక్ష చేస్తామన్నారు. చట్టం నుంచి సీఎం కిరణ్ తప్పించుకోలేరన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం చేసిన దోపిడిని తేలుస్తామని అన్నారు. దారినపోయే దానయ్యను సీఎం చేస్తే.. ఆయన అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచాలని సూచించారు. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని ప్రధానిని, సోనియాను డిమాండ్ చేశారు. తెలంగాణపై ప్రెస్‌విూట్‌లో సీఎం కిరణ్ అవాకులుచవాకులు పేలడంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పనికిమాలిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన పెట్టైనా సరే రాష్టాన్ని విభజించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు పక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్టాల్రు ఏర్పడితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిన సీమాంధ్ర సమస్యలు అన్ని తీరుతాయని వివరించారు. సీమాంధ్రులు నీళ్లు దోచుకుపోతున్నట్టు సీఎం కిరణ్ స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. విూ నీళ్లు, ఉద్యోగాలు దోచుకుంటామని సీఎం కిరణ్ , ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు బాహాటంగా ప్రకటిస్తున్నారని తెలిపారు. రేపటి తెలంగాణ రణభేరీ సభలో కిరణ్ కుమార్‌రెడ్డి చరిత్ర అంతా చెబుతానని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కిరణ్ అక్రమ బాగోతాలు అన్నీ బయటపెడతానని వివరించారు. తెలంగాణ ప్రకటన రాగానే సీఎం కిరణ్ ఎన్నో ఫైళ్ల విూద అఘామేఘాల విూద సంతకాలు చేస్తున్నాడని తెలిపారు. వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ రాగానే వాటిపై విచారణ జరిపిస్తామన్నారు.సమైక్య పాలనలో తెలంగాణకు ఒరిగిందేవిూలేదని కేసీఆర్ విమర్శించారు. ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నలబై ఏళ్లైనా కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని వివరించారు. కృష్ణానది ఎక్కడి నుంచి ఎక్కడికి పారుతుందో ఎవరిని అడిగినా చెబుతారని, అలాంటిది ఆయన పెద్ద పండితుడన్నట్టు కట్టె పట్టుకుని చూపిస్తూ వివరించాడని విమర్శించారు.
బేకార్ సీఎంను బర్తరఫ్ చేయండి




