మన్మోహన్‌ సమర్థ ప్రధాని


యూపీఏ విజయాలకు ఆయనే సారధి
దేశ ప్రజల్ని మతప్రాతిపదికన మోడీ విభజిస్తాడు
మేం దేశాన్ని ఏకతాటిపైకి తెస్తాం : సోనియా
కేరళ : కోట్లాది మంది పేదలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవితాల్లో ప్రధాని మన్మోహ న్‌సింగ్‌ చిరునవ్వులు నింపుతున్నారని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కొనియాడారు. యూ పీఏ ప్రభుత్వం సమర్థుడైన ప్రధాని నేతృత్వంలో అనేక ప్రజావూపయోజన కార్యక్రమాలు చేపడు తున్నదని చెప్పారు. రెండు రోజుల కేరళ పర్యట నకు వచ్చిన సోనియా ఆదివారం తిరువ నంతపురంలో కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ రీసెర్చ్‌ కమ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు దేశంలో కోట్లాదిమందికి లబ్ధిని చేకూరుస్తున్నాయని చెప్పారు. పేదరికంలో కూరుకుపోయిన ప్రజలకు ఆహారభవూదత, ఉపాధి తదితర పథకాలతో భరోసా కల్పించారని పేర్కొన్నారు. అనంతరం ఊమెన్‌చాంది నేతృత్వంలో కేరళ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత వైద్యం కల్పించడం సంతోషదాయకమన్నారు. అనంతరం కేరళ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఆర్‌ శంకర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శంకర్‌ వెనుకబడిన తరగతులు, విద్యావ్యాప్తికి నిరుపమాన సేవలు అందించారని పేర్కొన్నారు.
మౌనిక వసతుల కల్పనకు యూపీఏ కట్టుబడి ఉంది..
అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నది యూపీఏ అభిమతమని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. సరికొత్త భారత దేశాన్ని నిర్మించడానికి అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు. కుల, మత, ప్రాంతాల కారణంగా ఏ ఒక్కరూ వెనకబడిపోకూడదన్నారు. భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేసే కేరళ ప్రభుత్వ పథకాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించారు. నవభారతాన్ని నిర్మించాలన్న ఇందిర, రాజీవ్‌ల ఆశయాలకు కాంగ్రెస్‌ నిబద్దత కలిగివుందన్నారు.

తాజావార్తలు