Monday, 2 November 2026

ఇష్టం లేకుంటే ఇంటికి పో


సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తావా
కిరణ్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్‌ ఫైర్‌
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి)
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఇష్టం లేకుంటే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లవచ్చని ఏఐసీసీ అధి కార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కిరణ్‌ వ్యతిరే కించడాన్ని ఆయన తప్పుబ ట్టారు. న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేకన్నా రాజీనామా చేయడమే మేలన్నారు. కాం గ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ తీసు కున్న నిర్ణయం నుంచి వెనక్కుపోయే అవకాశం లేదన్నారు. అలాగే ఆంటోని కమిటీ సీమాంధ్రుల అభ్యంతరాలను పరిశీలిస్తుందని చెప్పారు. సీమాంధ్రులు విభజన తర్వాత తలెత్తే సమస్యలను ఆంటోనీ కమిటీకి విన్నవించాలన్నారు. వారి సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *