విభజన వేళ జగన్ సభకు అననుమతి వద్దు : జానారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 3 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరిం చాలని రాష్ట్రమంత్రి జానారెడ్డి మరోమారు విజ్ఞప్తి చేశా రు. రాష్ట్ర విభజన పక్రియ వేళ కొన్ని రాజకీయపక్షాలు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో సమైక్యవాదుల సభల తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన అన్నా రు. ఇలాంటి సభలను నిర్వహించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికే ఎన్జీవోల సభ, ఆ తరవాత తెలంగాణ ఎన్జీవోల సభ పెట్టారని అన్నారు. దీనివల్ల పోలీసులకు ప్రజలకు ఇబ్బందులు తప్ప వన్నారు. అందువల్ల ఇకముందు సమైకయ సభలతో ప్రజల్లో ఉద్రిక్తతలకు కారణం కారాదన్నారు. అలాగే తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం ఎవరితరంకాదని మంత్రి జానారెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణను ఏర్పాటు చేస్తూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. సమస్య పరిష్కారానికి సలహాలు ఇవ్వకుండా ఆందోళనలు చేయడం, తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలిన చూడటం సరియైందికాదని సూచించారు. కొన్ని పార్టీలు ఆందోళనలను రెచ్చగొడుతున్నాయని సీమాంధ్ర పార్టీలను విమర్శించారు. హైదరాబాద్‌లో వైసీపీ సభ పెడతామనడం తెలంగాణ వారిని రెచ్చగొట్టడమేనని అన్నారు. సభలు పెడతామని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. . సమస్య పరిష్కారానికి సలహాలు ఇవ్వకుండా ఆందోళనలు చేయడం, తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలిన చూడటం సరియైందికాదని సూచించారు. కొన్ని పార్టీలు ఆందోళనలను రెచ్చగొడుతున్నాయని సీమాంధ్ర పార్టీలను విమర్శించారు.
హైదరాబాద్‌లో వైసీపీ సభ పెడతామనడం తెలంగాణ వారిని రెచ్చగొట్టడమేనని అన్నారు. సభలు పెడతామని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. నల్లగొండ, వరంగల్‌లో వైసీపీ సమైక్య సభకు అనుమతినిప్పిస్తాం పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. అనవసరంగా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ మేరకు తాను సభలకు అనుమతి ఇవ్వద్దని సిఎంకు లేఖరాస్తానన్నారు.
ఇదిలావుంటే తెలంగాణపై అసెంబ్లీకి వచ్చే తీర్మానంపై ఓటింగ్ ఉండదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం మాత్రమే కోరతారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ అంశం అసెంబ్లీ తీర్మానానికి వస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఓడిద్దాం అని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులలో ఈ విషయంలో ఉత్కంఠ మొదలైంది. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందా? రాదా? వస్తే ఓటింగ్ జరుగుతుందా? అభిప్రాయమే కోరతారా?.. ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి.



