జై తెలంగాణ
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం
టీ నోట్‌కు కేబినెట్ ఆమోదం
సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
మూడు ప్రాంతాల ప్రజల హక్కుల పరిరక్షణ
కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్ 3 (జనంసాక్షి):
కేంద్ర మంత్రివర్గం తెలంగాణకు జై కొట్టింది. హైదరాబాద్ రాజధానిగా తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుకు ఆమోదము ద్ర వేసింది. తెలంగాణపై సిద్ధం చేసిన నోట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. గురువారం సాయంత్రం 5.30 కు ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో నిర్వ హించిన కేబినెట్ భేటీ రెండు గంటల పాటు సాగింది. ఈ భేటీ ఎజెండాలో మొదట తెలం గాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం లేదని చెప్పినా సోనియాగాంధీ ఆదేశాల మేరకు టేబు ల్ ఐటమ్‌గా కేబినెట్ ముందుకు తీసుకువ చ్చారు. ఈ అంశంపై కూలంకశంగా చర్చించిన మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీని యథాతథంగా ఆమోదించింది. పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచుతామని, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతోందని అన్నారు. సీమాంధ్ర ప్రాంతంగా ఉండే ఆంధ్ర óప్రదేశ్‌లో కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయా లనేదానిపై కేంద్ర మంత్రివర్గ బృందం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సమావే శానికి ఆంధ్రప్రదేశ్ నుంచి జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ జూలై 30న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఈమేరకు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తర్వాత కాస్త జాప్యం జరిగిన ప్రధాని నేతృత్వంలో కేబినెట్ నోట్‌కు ఓకే చెప్పింది. గురువారం సాయంత్రం యూపీఏ చైర్పర్సన్ సోని యాగాంధీ ఆదేశాల మేరకు టీ నోట్‌పై సంతకం చేసిన సుశీల్‌కుమార్ షిండే 20 పేజీలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ పేరుతో కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాల పంపిణీ, విద్యుత్ పంపిణీ, అప్పులు, ఆస్తులు తదితర అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ బృందం అన్ని సమస్యలను పరిష్క రిస్తుందని షిండే చెప్పారు. విభజన అనంతరం పంపకా లపై మంత్రుల బృందమే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులన్నింటినీ పరిగణలోకి తీసుకుం టామని షిండే వెల్లడించారు. సీడబ్ల్యూసీ సూచించి నట్లుగా పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆలోపు మంత్రుల బృందం నిర్ధారించిన నగరంలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని చర్యలను కేంద్రం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీల ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా తెలంగాణ ఏర్పా టు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. కాగా కేబిన ెట్ భేటీలో పాల్గొన్న సీమాంధ్ర ప్రాంత మంత్రులు కావూ రి సాంబశివరావు, పళ్లంరాజు టీ నోట్‌ను వ్యతిరే కించి నట్లు సమాచారం. అయితే కేబినెట్ మంత్రుల్లో సింహ భాగం సోనియాగాంధీ నిర్ణయానికి ఆమోదముద్ర వేయ డంతో తెలంగాణ ప్రజల్లో ఆనందాలు వెళ్లివి రిశాయి.