ఎన్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు

న్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు
అఖిలపక్షం తర్వాతే సీడబ్ల్యూసీ నిర్ణయం
జగన్‌, చంద్రబాబు విభజనకు ఒప్పుకున్నారు
వాళ్లు నిర్ణయాలు మార్చుకుంటే.. మేం మార్చుకోం
దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) :
ఎన్ని అవాంతరాలున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఇండోర్‌లో దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు.  అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే.. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ పునరుద్ఘాటించారు.విభజన ప్రకటన తర్వాత మిగతా పార్టీలన్నీ యూ-టర్న్‌ తీసుకున్నాయని మండిపడ్డారు. వారిలా తాము విధాన నిర్ణయాలు మార్చుకోలేమని చెప్పారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేదని ప్రకటించారు. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న నిరసన జ్వాలల నేపథ్యంలో… ఎన్ని అవాంతరాలు ఎదురైనా విభజన జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. అందరితో చర్చించి, అన్ని పార్టీలను సంప్రదించే ఏకాభిప్రాయంతో సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా తెలంగాణకు అనుకూలమనే చెప్పారన్నారు. అయితే, ప్రకటన తర్వాత కొన్ని పార్టీలు వెనక్కు తగ్గడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మమ్మల్ని కూడా నిర్ణయాన్ని వెనక్కుతీసుకోమంటే ఎలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంపై వెనక్కు తగ్గదని ఆయన తేల్చి చెప్పారు. మిగతా పార్టీల్లా తాము పూటకో నిర్ణయం తీసుకోలేమని దెప్పిపొడిచారు. సీమాంధ్రలో తీవ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలోనూ ముందుకే వెళ్లనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా విభజన జరుగుతుందన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హావిూ ఇచ్చారని, ఆమేరకు నడుచుకోవాలని దిగ్విజయ్‌సింగ్‌ సూచించారు. తమ పార్టీ సీమాంధ్ర నేతలతో ఒకటికి రెండుసార్లు చర్చించిన తర్వాతే విభజన నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు హావిూ ఇచ్చారని చెప్పారు. తాను సీమాంధ్ర, తెలంగాణ నాయకులతో మాట్లాడానని.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో ఇచ్చిన హావిూ మేరకు హైకమాండ్‌ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని కోరారు. రాష్ట్ర విభజనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.