పుత్తూరులో కమెండో ఆపరేషన్

మిలిటెంట్ల షెల్టర్‌పై పోలీసుల మెరుపుదాడి
బిలాల్ అహ్మద్, ఇస్మాయిల్‌ల అరెస్టు
ఎదురుకాల్పుల్లో సీఐ మృతి?
చిత్తూరు, అక్టోబర్ 5 (జనంసాక్షి) :
చిత్తూరుజిల్లా పుత్తూరులో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి..పుత్తూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నుండి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పుత్తూరులోని గేట్ పుత్తూరులో ఓ ఇంటిలో ఉగ్రవాదులు బస చేశారనే సమాచారం తెలుసుకున్న తమిళ నాడు, ఆంధ్రా పోలీసులు కమెండో ఆపరే షన్ నిర్వహించారు. ఇద్దరు తీవ్రవా దులతో పాటు ఒక మహిళ, ముగ్గు రు పిల్లలను అదుపులోకి తీసుకుని వీరిని చెన్నైకి తరలించారు. వీరిలో బిలాల్ అహ్మద్ (32), ఇస్మాయిల్ (42) తదితరులు ఉన్నారు.
ఆపరేషన్ ఇలా..
కేంద్ర నిఘావర్గాల నుంచి అందిన సమా చారం మేరకు పుత్తూరులో ఆపరేషన్‌ను శుక్రవారం అర్ధరాత్రి నుండి కొనసాగిస్తు న్నారు. తుపాకి, రెండు బాంబులను స్వాదీ óనం చేసుకున్నారు. సోదాలు నిర్వహిస్తున్న పోలీసులపై అనుమానితులు దాడికి పాల్పడడంతో తమిళనాడుకు చెందిన సిఐకి, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. అనుమానితులు ఇంట్లోనే ఉన్నారన్న నిర్ధారణకు రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడి నుండి తరలించారు. అక్టోపస్ దళాలు సైతం ఆ ఇంటిని ముట్టడించాయి. ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. సజీవంగా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇంటిలో ముగ్గురు ఉగ్రవాదులు, ఒక మహిళ, ఒక బాలుడు ఉన్నట్టు సమాచారం. ఇదిలాఉండగా ముగ్గురు ఉగ్రవాదులు.. తమిళనాడు బిజెపి నేత రమేష్ హత్య కేసులో నిందితులని తెలుస్తోంది. వెలుపలకు రావాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు వేచి చూసి.. ఆ తర్వాత ఆపరేషన్‌ను తీవ్రతరం చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది.
ఉగ్రవాదుల దాడిలో గాయపడిన సీఐ మృతి
పుత్తూరులో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన సిఐ లక్ష్మణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు తెలిసింది.
సర్వత్రా ఉత్కంఠ
పుత్తూరులో ఉగ్రవాదులు ఉన్నారన్న వార్తలతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర నిఘా వర్గాల ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందింది. తమిళనాడు పోలీసులు-ఆంధ్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్‌కు పూనుకున్నారు. పుత్తూరులోని మసీదు వీధిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదులున్నారంటూ అనుమానిస్తున్న ఇంటిని అక్టోపస్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బాంబు నిర్వీర్య స్వ్కాడ్ బృందాలను రప్పించారు. సమీపంలో ఒక అగ్నిమాపక యంత్రాన్ని ఉంచారు. ప్రముఖ వైద్య బృందాన్ని, ఒక అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. తిరుపతి, తమిళనాడుకు వెళ్లే మార్గం వద్ద గట్టి నిఘా ఉంచారు. ఈ ఆపరేషన్‌లో సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చిత్తూరు ఎస్‌పి కాంతి రాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్‌పి రాజశేఖర్, ఎఎస్‌పి ఉమామహేశ్వర శర్మ తదితరులు పుత్తూరులో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.



