కృత్రిమ ఉద్యమం వికృత రూపం


ఉద్యమం ముసుగులో సీమాంధ్రలో దొమ్మి
లూటీలు, దహనాలు
విజయవాడలో కర్ఫ్యూ
విజయనగరం, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) :
సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం వికృత రూపం దాల్చింది. ఉద్యమం ముసుగులో సమైక్య వాదులు రెచ్చిపోయారు. విజయన గరం రణరంగంగా మారింది. సమైక్యవాదుల ముట్టడి, పోలీసుల అడ్డగింత యుద్ధాన్ని తలపించింది. పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ఇల్లు, ఆస్తులే లక్ష్యంగా సమైక్యవాదులు రెచ్చిపోయారు. విద్యార్థులు, ఉద్యోగులు బొత్స ఇంటిపై దాడులకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అడ్డుకున్న పోలీసులు సమైక్యవాదులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. పోలీసులు వారి చర్యలను తిప్పికొట్టేందుకు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసులు తరిమికొట్టడం, ఆందోళనకారులు మళ్లీ ముందుకు రావడంతో శనివారం రోజంతా ఉద్రిక్తత నెలకొంది. దాడులకు దిగిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు బొత్స సత్యనారాయణెళి అని కొందరు రాజకీయ నేతలు దుష్పచ్రారం ప్రారంభించిన నేపథ్యంలో.. సమైక్య ముసుగులో ఆందోళనకారులు ఆయన ఆస్తులను టార్గెట్‌గా చేసుకున్నారు. శుక్రవారం పెద్ద సంఖ్యలో బొత్స ఆస్తులను ధ్వంసం చేశారు. తాజాగా శనివారం ఉదయమే బొత్స నివాసంపై పడ్డారు. సమైక్య ఉద్యమం పేరుతో విధ్వంసానికి దిగారు. ఇంటి ముట్టడి అంటూ సవిూపంలో ఉన్న రాళ్లతో దాడి చేశారు. అడ్డుకొనేందుకు యత్నించిన పోలీసులపైనా రాళ్లు విసిరారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. లాఠీచార్జి చేయడంతో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పదే పదే పోలీసులు తరిమికొట్టడం, ఆందోళనకారులు వెనక్కు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ ముందుకు రావడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఇదిలా ఉంటే, బొత్సకు చెందిన సత్య స్టోన్‌క్రషర్స్‌పై సమైక్యవాదులు కొందరు దాడి చేశారు. ఆఫీసుకు నిప్పుపెట్టారు. రెండ్రోజులుగా పరిస్థితులను గమనించిన పోలీసులు బొత్స నివాసం, కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులను నియమించి భద్రతను మోహరించారు.

సీమాంధ్రలో బొత్సే సింగిల్‌ టార్గెట్‌

హైదరాబాద్‌ : రాష్టాన్న్రి గతంలో ఇచ్చిన హామి మేరకు కేంద్రం విభజిస్తే జీర్ణించుకోలేని పెట్టుబడిదారులైన సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా కృత్రిమ ఉద్యమాలు సృష్టించారు. రోజురోజుకు మరింత ఉదృతం  అవుతున్నా కూడా నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు స్వయంగా ఫైనాన్స్‌ చేస్తూ ఉద్యమాన్ని నడిపిస్తూ వచ్చారనేది కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఉన్న స్పష్టమైన సమాచారం. అయితే నిర్ణయం రావడానికి ఒక్‌ కాంగ్రెస్‌ నేతలే కారణం కాకపోయినా ఏపిఎన్జీఓలు, ఆందోళనకారులు మాత్రం కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేయడం వారిని సీమాంద్రకు చెందిన పెట్టుబడిదారులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు కొరివి తలకాల్చుకుంటున్నారనేది మదన పడుతున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్తున్న మాటలను ప్రజల్లోకి తీసు కెల్లిపార్టీని కాపాడడంతోపాటు, తమనుతాము కాపాడుకోలేక పోవడం వారి అసమర్థతకు నిదర్శనంగా చెప్పక తప్పదు. హైకమాండ్‌ చెప్తున్న ప్రతిపక్షాలన్నీ రాష్టాన్న్రి విభజించాలని ముక్తకంఠంతో లేఖలిచ్చిన తర్వాత కనీసం మూడేళ్ల తర్వాతనే కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుందనేది వాస్తవం. ఇన్ని అనుకూల పరిస్థితులున్నా కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రం తమ స్వంత ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఒక్క కారణంతోనే ఉద్యమాలను సృష్టించారనేది వాస్తవం. ఉద్యమాలకు డైరెక్షన్‌ కూడా కాంగ్రెస్‌కుచెందిన సిఎం, లగడపాటి, రాయపాటి, గంటా శ్రీనివాస్‌రావు, శైలజానాథ్‌, టిజి వెంకటేశ్‌, ఏరాసు ప్రతాపరెడ్డితోపాటు పలు వురు నేతలు ఇస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు. సీమాంధ్ర నేతలు పార్టీని రక్షిం చాల్సింది పోయి నిండా ముంచేందుకు ప్రయత్నిస్తున్నారనేది కూడా అంతే వాస్తవం. ఇదంతా ఇలా ఉంటే కేంద్రం గురువారంరాత్రి కేంద్రప్రభుత్వం క్యాబినెట్‌ నోట్‌ను తయారుచేసి ఏకగ్రీవంగా ఆమోదించింది.దీంతో సీమాంధ్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి పడడమేకాక, విధ్వంసాలకు కూడా పాల్పడుతున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడడమేకాక ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్ర విభజన కార్యక్రమంలో ఉద్యమకారులుచెప్పినట్లుగా పాటించని కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు,ఎంపిలు,కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆందోళనకారులు మాత్రం కేవలం పిసిసి అధ్య క్షుడు బొత్స సత్యనారాయణను మాత్రమే టార్గెట్‌ చేసి ఆయన ఇంటిని, క్యాంప్‌ ఆఫీస్‌ను, స్వంత ఆస్థులైన సత్య కేబుల్‌ కార్యాలయాన్ని, ఇంజనీరింగ్‌ కళాశాలలపై కూడా దాడులుచేసి లక్షలాది రూపాయల ఆస్థిని బుగ్గి పాలు చేశారు. ఇంత జరుగుతున్నా కూడా సిఎం ఆందోళనకారులను నివారించడంలో పోలీసులను మాత్రం శాంతంగా ఉండాలంటూ సందేశాలిస్తూ ఆస్థులు బుగ్గిపాలైనా సరే ముందుకు వెల్లకూడదని హైదరాబాద్‌ నుంచే సంకేతాలు కూడా జారీచేశారంటే బొత్సపై ఉన్న కోపంను చెప్పకుండానే చెప్పారనేది వాస్త వం. అయితే తనను మాత్రమే టార్గెట్‌ చేయడంతో బొత్స కుమిలిపోయినట్లుగా కనిపించాడు. తాను సైతం సమైక్యం కోసమే ప్రయత్నిస్తున్నానని చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సాయంత్రానికి స్పందిం చిన బొత్స రేపటినుంచి తాను కూడా స్వయంగా ఉద్యమంలో పాల్గొంటానని కూడా తేల్చిచెప్పారు. దీంతో నైనా ఆందోళనకారులు వెనక్కి తగ్గుతారా లేదా చూడాల్సిన అవసరంఉంది. పాపంఏకాకిగా మారినా బొత్సను పార్టీనేతలు కూడా రక్షించేందుకు ప్రయత్నించక పోవడంతో లోలోన కుమిలిపోతున్నాడనేది వాస్తవం.

తాజావార్తలు