
వ్యక్తిగత ఆస్తులే లక్ష్యంగా విధ్వంసాలు
ఉన్మాదుల్లా రెచ్చిపోతున్న ఏపీఎన్జీవోలు
ఉదాసీనంగా పోలీసులు
హైదరాబాద్, అక్టోబర్ 6 (జనంసాక్షి) ః
రాష్ట్రవిభజన తర్వాత సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమంకాస్తా అసాంఘీ క శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిం ది. క్యాబి నెట్లో తెలంగాణ నోట్‌ను ఆమోదించ డంతో సీమాంద్రలో సమైక్య ఉద్యమం కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మద్య వైరి పోరాటంగా మారుతోందనిపించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంద్రలో ఉద్యమా లు గత 60రోజులుగా కొనసాగుతున్నప్పుడు కూడా విధ్వంసకర సంఘటనలు, చట్టాలను చేతుల్లోకి తీసుకున్న సంఘటనలు కోకొల్లలుగానే చోటుచేసుకుంటూ వచ్చాయి. అధికారపార్టీకి చెందిన జాతీయనేతలైన ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలను కాల్చినా, కూల్చినా కూడా సిఎం స్వార్థ చింతనతోనే చూస్తూ మిన్న కుండి పోయారనేది వాస్తవం. దీన్నిఅలుసుగా తీసుకున్న సీమాంధ్ర ఆందోళనకారులు మరోసారి రెచ్చిపోతూ నేడు ఏకంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను బుగ్గిపాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఈసారి చూసుకుంటే 13 ఏళ్లుగా కొనసాగుతుంటే ఏఒక్క జిల్లాలోకూడా కర్ఫ్యూ పెట్టేవరకు వెళ్లిన దాఖలాలు లేనేలేవు. అదే కేవలం 60రోజుల ఉద్యమంలో ఈదుస్సంఘటన చోటుచేసుకోవడానికి సమైక్యవాదినని గొంతు చించుకుని అరుస్తు న్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరంఉంది. జాతీయ రహదారుల దిగ్బందనంచేస్తే నే ఇనుపకంచెలు వేయడమేకాక పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించి ఉద్యమకారులను అడ్డుకున్న సిఎంఅలాంటి పని ఒక్కటి కూడా చేయనే లేదంటే పక్షపాతం ఎంత స్థాయికి శృతిమించిందో అర్థం చేసుకో వచ్చు. అంతే కాకుండా బైండోవర్లు, ముందస్తు అరెస్ట్‌లు, హౌజ్ అరెస్ట్‌లు కొనసాగించి యుద్ద వాతావరణాన్ని కావాలని పోలీసులతో సృష్టించిన ఘనత సీమాంద్రకుచెందిన కిరణ్‌కుమార్‌రెడ్డికే చెల్లుతుంది. సీమాంధ్రలో ఉద్యమం కాస్తా అసాంఘీక శక్తుల చేతుల్లోకి పోతుందని చాలామంది మేధావులు నెత్తీ నోరు బాదుకుని చెప్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోని సిఎం, ఇంకా ఇంకా ఉద్యోగ సంఘాలను ఉసికొల్పిన సంఘటనలు ఎన్నో ఈకాలంలో ప్రజలు స్వయంగా గమనిస్తూనే వచ్చారు. అదే నేడు జరిగిపోయింది. రాష్ట్ర విభజనకు ఇరు ప్రాంతాల నేతలు అంగీకరిస్తామని, హైకమాండ్ తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని ప్రగల్బాలు పలికి న సీమాంధ్ర నేతలు, సిఎం, పిసిసి అధ్యక్షుడు, కేంద్రమంత్రులు అంతా కూడా వెనక్కి తగ్గడమేకాక అధిష్టా నంతో అవిూతువిూకి దిగారు. తత్పలితంగా ఈ అరవై రోజుల కాలంలో సీమాంద్రలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే రెండు వర్గాలుగా విడిపోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని ఏదశ లో తీసుకోవాల్సి వచ్చిందో తమ ప్రజలకు వివరించి పార్టీని గట్టెక్కించాల్సి ఉన్నా ఆపనికి మాత్రం ఒడిగట్టి నపాపాన ఒక్కరోజంటే ఒక్కరోజుకూడా పోయిన పాపాన పోలేదనేది వాస్తవం. అంతేకాకుండా హైకమాండ్ పై ధిక్కారధోరణిని అవలంభిస్తూ వస్తున్నారు.రాష్ట్రంలో ముఖ్యమైన పదవిలో ఉన్నముఖ్యమంత్రే స్వయం గా ఓగ్రూప్ను ప్రోత్సహించడం అదికాస్తా వర్కవుట్ కాకపోవడంతో మరోఅస్త్రంగా ఉద్యోగసంఘాలను ఉసి గొల్పడమేకాక సమ్మెలోకి పంపించడం, ఉద్యమాన్ని వారి చేతుల్లోకి తీసుకునేలా చేశాడంటే రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవిస్తున్నాడో కూడా అర్థం అయిపోయింది. అటు హైకమాండ్ నిర్ణయాన్ని ఇటు రాజ్యాంగాన్ని సైతం ధిక్కరిస్తూవచ్చిన సిఎంమరోసారి పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలను రెండు గ్రూపులుగా విడిపోయేం దుకు దోహదం చేసిన వ్యక్తిగా కూడా రాష్ట్ర విభజన చరిత్ర లో హిట్లర్గానో, నీరోచక్రవర్తిగానో మిగిలి పోక తప్పదని ఆపార్టీ నాయకులే సిఎంపై నిప్పులు చెరుగుతున్నా రు. ఎన్ని ఉద్యమాలు చేయించుకున్నా చట్టా నికి లోబడి జరిగితే ఏఒక్కరికి కూడా బాధ, బెంగ ఉండదనేది వాస్తవం. కేంద్రం కూడా సిఎం గ్రూప్ చేస్తున్న అరాచకాలను చూస్తూ వస్తూనే ఉంది. ఇప్పటివరకు వెయ్యిసార్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆపబోమని ఢిల్లీలోని పెద్దలంతా చెప్పినా కూడా పట్టించుకున్న పాపాన పోక పోగా ఉద్యమాలతో అధిష్టానం మెడలు వంచుతామనే ధీమాతో వచ్చారు. నేడు వారు నమ్ముకున్న ఉద్యమాలు వారికే తలనొప్పిగా మారాయనేది వాస్తవం.అయితే ఇప్పుడుకూడా తమ సీమాంధ్రలో అధిష్టానానికి అనుకూలంగా మారిననేతలు, తనకు బద్ద శత్రువుగా మారిన బొత్స సత్యనారాయణకు చెందిన స్వంత ఆస్తులను, అదే వర్గానికి చెందిన అమలాపురం ఎంపి హర్షకుమార్కు చెందిన ఆస్తులను, బుగ్గి పాలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నట్లుగా ఆపార్టీ నేత లే వ్యాఖ్యానిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు పదవిచ్చిన సోనియాగాంధీని దిక్కరించిన సిఎం నేడు ఇంకా ముందుకు వెల్తూ ఉన్మాదిగా మారి వ్యతిరేక వర్గానికి చెందిన నేతల ఇళ్లను, ఆస్తులను ధ్వంసాలు, కాల్చివే తలకు ప్రోత్సహిస్తూ ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ పరిణామా లు ఇలాగేకొనసాగించి పైచేయి సాధించాలని సిఎం ఆయనవర్గం పన్నిన కుట్ర కాస్తాబెడిసి కొట్టిందని బొత్స వర్గానికి చెందిన నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధిష్టానం ఎంత విశ్వాసంతోనైతే కిరణ్‌పై పెట్టు కుందో అందులో కనీసం జీరో పాయింట్ వన్ శాతం కూడా నిలుపుకోవడం లేదని ప్రస్తుత పరిణామాలను చూస్తున్న ప్రతిఒక్కరికి అర్థంఅవుతోంది. అన్నంపెట్టిన వారికిసున్నం పెట్టేవారుంటారంటే ఇంతవరకు చాలా మందికి తెలియక పోయినా సిఎం కిరణ్ వ్యవహారం చూస్తున్న ప్రతిఒక్కరికి మాత్రం అర్థం అవుతుందని సీ మాంద్రలో ఉద్యమాలుమాత్రం అదుపుతప్పుతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. పైశాచికానందం పొందు తున్న సిఎంమాత్రం తనవైఖరిని మార్చుకునేందుకు నేటికి కూడా ప్రయత్నించడంలేదని వైరివర్గాలు పేర్కొం టున్నాయి. ఇంతకాలం సిఎంవెంటే ఉంటూ వచ్చిన నేతలంతా క్యాబినెట్ నోట్ తర్వాత మాత్రం ఆయనను ఇంకా తమ నాయకుడిగా గుర్తించేందుకు ససేమిరా అనేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వస్తోంది. రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన కిరణ్‌ను తెలంగాణాకు చెందిన నేతలంతా బద్ద శత్రువుగానే చూస్తున్నా రు. చూడాల్సిన అవసరం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తనకు బాద్యతలు అప్ప గించండి అధిష్టానం మెడలు వంచి రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచుతానంటూ సీమాంద్రలోని ఎంపిలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం ఆయన నేడు కొరకగాని కొయ్యగానే మారిపోయాడు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, మాజీ ఇంచార్జ్‌లు, ఏఐసిసి పెద్దలు, చివరికి ప్రధానమంత్రి, పార్టీ అధినేత్రి సోని యాగాంధీ సైతం కుండబద్దలు కొట్టినట్లు తెలంగాణారాష్ట్రం ఏర్పాటును ఖచ్చితంగాచేసి తీరుతామనే చెప్తూ వచ్చారు.అయినా కూడా సిఎం వైఖరిలోమాత్రం మార్పు రానేలేదంటే ఎంత మూర్కుడో ఇట్టేఅర్థం అవుతుం దని రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆయన వైఖరి రోజురోజుకు ముదురుతుండడం తో ఇహ అక్కడ ఉంటే లాభం లేదని గుర్తించిన మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ తదితరులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్తిబాబుతో సమాలోచనలు చేశారు. సిఎంగా అధిష్టా నం మాటను కిరణ్ ప్రక్కన పెడుతున్నా, పిసిసి అద్యక్షుడిగా పార్టీకి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవస రం ఉందని చెప్తూ రావడంతో సత్తిబాబు మనసు మార్చుకున్నారు. హైకమాండ్‌కు దగ్గరయ్యేందుకు ప్రయ త్నించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేయడంతో ఆయన వైపు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తమప్రాంతాన్ని అభివృద్ది చేసుకునేందుకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి నిధులు, సంస్థలు అధికంగా తెచ్చుకుందామనే భావనకు ఆవర్గం వచ్చింది. ఇప్పుడు కిరణ్‌కు పుండు విూద కారం పోసినట్లుగా మారింది. ఆయనేమో అధిష్టానానికి అనువుగా ఉంటూ తనను మాత్రం దోషిగా నిలపెడు తాడా అని మసిలిచ్చుకుంటున్న కిరణ్ ఏపిఎన్జీఓలను సమ్మెకు ఎలాగైతే ఉసిగొల్పాడో అలాగే విధ్వంసాల కుపాల్పడేలా రెచ్చగొడుతున్నాడని పరిస్థితులను గమనిస్తున్న ప్రతిపక్షాలతోపాటు, సీమాంద్రలో మెజార్టీ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సిఎంగా ఇరుప్రాంతాలకు సమానంగా ఉంటూ కేం ద్రానికి సహకరించాలనేది ఏమాత్రం రాజకీయం తెలిసిన వారైనా ఇట్టేచెప్పే వాస్తవవిషయం. అయితే ఆయ న మాత్రం అందుకు భిన్నంగా కేవలం తాను సీమాంద్ర వ్యక్తినేనంటూ వ్యవహరిస్తూ వచ్చాడు వస్తున్నాడని , రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సిఎం రాజకీయ భవిష్యత్‌ను తనకు తానే నాశనం చేసుకుంటున్నాడని ఆరో పణలు వినిపిస్తున్నాయి. అవసరం అయితే తామే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీమాంద్రలో కొత్తపార్టీని కూడా పెడుతామని ఒకరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలను వెంటేసుకుని ప్రకటనలు చేయించడమేకాక, ఆపార్టీకి కిర ణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం వహిస్తాడని ప్రకటనలు కూడా చేయించడంతో అధిష్టానం ఇంకా ఇంకా దూకుడు పెంచేలాచేశాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు గత 48 గంటలుగా పరిస్థితులు చేయిదా టడంతో కాస్తా అధిష్టానం వైపు మల్లేందుకు ప్రయత్నాలు చేయాలని సిఎం తన బాకా రాయుళ్లతో మంతనా లు చేస్తున్నట్లుకూడా సమాచారం. ఏదిఏమైనా సీమాంద్రలో మాత్రం ఉద్యమం అటు రాజకీయ నాయకులు, ఇటు ఏపిఎన్జీఓల చేతుల్లోంచి అసాంఘీక శక్తుల చేతుల్లోకి పోయిందనేది వాస్తవం. దీని వల్ల రాబోయే రోజు ల్లో కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావనేది వాస్తవం. సీమాంద్ర జిల్లాల్లో నేడు పరిస్థితులను అదుపులోకి తీసు కు వచ్చి మామూలు వాతావరణం కల్పించకపోతే మాత్రం ఇప్పటివరకు కేవలం పార్టీకి, నేతలకు మాత్రమే దూరమైన సిఎం కిరణ్ త్వరలోనే ప్రజలకు కూడా దూరం కావడం తథ్యం.
సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో సమైక్య లొల్లి




