
నెహ్రూ జూపార్క్ స్వర్ణోత్సవ సభలో సీఎం
హైదరాబాద్, అక్టోబర్ 6 (జనంసాక్షి) :
వన్య ప్రాణులను రక్షించుకోవడం అందరి బాధ్యత.. అలాగే చెట్లు మానవ మనుగడకు జీవనాధారం.. సంరక్షించుకోవడం ప్రతిఒ క్కరి బాధ్యత అని ముఖ్యమంత్రి కిరణ్కుమా ర్రెడ్డి అన్నారు. నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్క్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత ప్రప్రథమ ప్రధాన మంత్రి నెహ్రూ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ సంపదను కొల్లగొట్టే స్మగ్లర్లు, జంతు వేటగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అడవుల సంరక్షణ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. జంతు సంరక్షణలో పనిచేసే గుర్తింపు కలిగి మూడు సంవత్సరాలు నిండి ఉన్నవాటికి ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సహకాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 50 సంవత్సరాలుగా జంతువులు ఉన్నాయని, మానవులతో సహజీవనం చేస్తున్నాయని అన్నారు. బయోడైవర్సిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వన్య ప్రాణులను ప్రేమించడమే గాక.. వాటి ఆలన పాలనలో నిమగ్నమై ఉండే అధికారులను, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. భూమి మీద ఉన్న ప్రతి జీవి యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. మనుషులతో స్నేహం చేస్తే విభేదాలు రావచ్చుగాని జంతువులతో స్నేహం చేస్తే మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయవద్దని కోరారు. అడవులను నాశనం చేస్తే ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని తద్వారా మానవుడి మనుగడ ప్రశ్నార్దకమవుతుందన్నారు. గత సంవత్సరం జూపార్క్ నుండి 15 పులులను దత్తత తీసుకున్న ఎస్పిహెచ్ సంస్థకు వాటి సంరక్షణ నిమిత్తం ఖర్చుకు సంబంధించిన 15 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి జూలాజికల్ సంస్థకు అందజేశారు. జంతువుల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. జంతువుల సంరక్షణపై శ్రద్ధ చూపే వారికి కెవి బాపు అవార్డులను అందజేసే విషయం తెలిసిందే. జూలో పనిచేసే సిబ్బందికి ముఖ్యమంత్రి కెవి బాపు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామారావుతో పాటు జూపార్క్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
జంతు జీవజాలమే ప్రగతికి మూలాధారం




