Tuesday, 3 November 2026

7న ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సమావేశం

విజయవాడ,జూలై5(జ‌నం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీఎస్టీ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు 7న సమావేవాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈనెల 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్సీఎస్టీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్సీఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ వెల్లడించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖమంత్రి నక్కా ఆనందబాబు పాల్గొంటారని తెలిపారు.

—–