హైదరాబాద్: ఢిల్లీ అజవత్‌నగర్‌లో కారు నుంచి రూ. 7 కోట్లు చోరీ చేసిన కేసులో శుక్రవారం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 మందికి పైగా వ్యక్తులకు ఈ చోరీతో సంబంధం ఉన్నట్లు వారు తెలిపారు. నిందుతుల వివరాలు తెలుసుకునేందుకు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. విచారణలో తేలిన వివరాల క్రారం బధితుడు రాజష్ కల్రాకు మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో సబంధం ఉన్నట్లుపోలీసులువెల్లడించారు. సంజీవ్ చావ్లా అనే క్రికెటర్నఉ అండన్‌కి చెందిన బుకీకి పరిచయం చేసినట్లు ఆరోపణలున్నాయన్నారు. చోరీ జరిగినరోజున కారులో తీసుకెళ్తున్న ఏడు కోట్లకు పైగా ఉన్న మొత్తంలో యూరోలు, డాలర్లు, ఉన్నయని, ఆ మొత్తం హవాలాకుచెందినది కాని, బెట్టింగ్ కోసం వినియోగించేది కానీ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




